Mahesh Babu: SSMB 28లో మహేష్ పాత్రను త్రివిక్రమ్ ఇలా డిజైన్ చేస్తున్నారట.. ఫ్యాన్స్ కు పూనకాలే
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. ఇటీవలే ఈసినిమా పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాలోని పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారట. మహేష్ గతంలో నాని సినిమా చివరిలో డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మహేష్ కంప్లీట్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. రెండు పాత్రలను త్రివిక్రమ్ చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారని తెలుస్తోంది, ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో వచ్చే రెండో పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందట.. మహేష్ ఈ పాత్రలో చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారని అంటున్నారు. మహేష్ డ్యూయల్ రోల్ కాబట్టి ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పూజాహెగ్డే ఓ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. రెండో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక ను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై రెండో వారం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి