Konda Surekha : ‘వర్మకి ఏం ఇచ్చుకున్నా మా రుణం తీర్చుకోలేం’.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ సినిమా కొండా. వివాదాస్పద వాస్తవాలను కథలుగా ఎంచుకొని సినిమాలు చేసే ఆర్జీవీ.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ సినిమా కొండా. వివాదాస్పద వాస్తవాలను కథలుగా ఎంచుకొని సినిమాలు చేసే ఆర్జీవీ. ఇప్పుడు కొండా మురళి, కొండా సురేఖల(Konda Surekha)జీవిత కథతో సినిమా చేస్తున్నారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది.నక్సలిజం, రాజకీయ బ్యాగ్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండనుంది. కొండా సుష్మితా పటేల్ ఈ సినిమాను నిర్మించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది. తాజాగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో కొండా సురేఖ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖ మాట్లాడుతూ ”30 సంవత్సరాల మా జీవిత చరిత్రను రెండున్నర గంటల్లో ఎంతో ఇష్టంతో తీసినందుకు వర్మకి ఏం ఇచ్చుకున్నా మా రుణం తీర్చుకోలేం. ఇటువంటి సంఘటనలు మా జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. కొండా మురళి నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ రోజు నేను ఇలా ప్రజల ముందు నిలబడ్డాను. నా జీవిత చరిత్ర వారితో తెరకెక్కింది. సుష్మిత నా బంగారం. నాతో పాటు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది. ఇక.. ‘కొండా’లో మురళి గారి పాత్ర పోషించిన త్రిగుణ్ నా కొడుకు లాంటోడు. మా అమ్మాయి కంటే పదేళ్లు చిన్నోడు. మేడమ్ అని మెసేజ్ పెడితే.. ‘అమ్మ’ అని పిలవమని చెప్పా. అప్పట్నుంచి అమ్మ అని పిలుస్తున్నాడు. మురళి గారి పాత్రలో బాగా చేశాడు. నా పాత్రలో ఇర్రా మోర్ కూడా బాగా నటించింది. ఇక్కడికి వచ్చిన వర్మ గారి కుటుంబ సభ్యులకు థాంక్స్. జూన్ 23 నుంచి థియేటర్లలో సినిమా చూడండి. ‘కొండా’ చూశాక.. ప్రజల్లో ప్రశ్నించే తత్త్వం వస్తుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి