AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahavtar Narishimha: 300 కోట్ల వైపు అడుగులు.. ‘మహావతార్‌ నరసింహ’ అసలు బడ్జెట్ ఎంతో చెప్పేసిన డైరెక్టర్

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. 100 కోట్లు వసూలు చేసిన తొలి యానిమేషన్ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా 300 వందల కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు 'మహావతార్ నరసింహ' సినిమా అసలు బడ్జెట్ ఎంతనేది వెల్లడించారు.

Mahavtar Narishimha: 300 కోట్ల వైపు అడుగులు.. 'మహావతార్‌ నరసింహ' అసలు బడ్జెట్ ఎంతో చెప్పేసిన డైరెక్టర్
Mahavtar Narishimha Movie
Basha Shek
|

Updated on: Aug 12, 2025 | 8:18 PM

Share

‘మహావతార్ నరసింహ’ దేశంలోనే అతిపెద్ద యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. జులై 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోన్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను హిందువులు మాత్రమే కాకుండా వివిధ వర్గాల ప్రేక్షకులు కూడా ఎగబడి చూస్తున్నారు. 300 కోట్ల కలెక్షన్ల వైపు వేగంగా అడుగులు వేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ గురించి దర్శకుడు అశ్విన్ కుమార్ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇదే సందర్భంగా ఈ యానిమేటెడ్ సినిమా ఖచ్చితమైన బడ్జెట్‌ను కూడా వెల్లడించారు.

“ఒక యానిమేటెడ్ సినిమా మొదటి వారంలోనే రూ. 100 కోట్లు వసూలు చేయడం నిజంగా ఆనందకరమైన విషయం. ఇంత భారీ వసూళ్లు వస్తాయని మేం ఊహించలేదు. మన దేశంలో వివిధ మతాలు, సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తున్నారు. బహుశా ఈ వైవిధ్యం వల్లే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఇంతగా తాకింది. భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగా కనిపించే విభిన్నమైన, గొప్ప యానిమేషన్ అనుభవాన్ని మేము ప్రేక్షకులకు అందించాము. భారతదేశంలో చాలా మంది యానిమేషన్ చిత్రాలు పిల్లల కోసం మాత్రమే అని అనుకునేవారు. కానీ మా సినిమా ఈ ఆలోచనను మార్చేసింది’

ఇవి కూడా చదవండి

“ఈ సినిమా విజయం అనేక యానిమేటెడ్ చిత్రాలకు ద్వారాలు తెరిచింది. యానిమేషన్ ఒక శక్తివంతమైన మాధ్యమం అని నిర్మాతలు, డైరెక్టర్లు అర్థం చేసుకోవాలి. హాలీవుడ్, చైనా, జపాన్, కొరియా చాలా సంవత్సరాలుగా ఇలాంటి సినిమాలను నిర్మిస్తున్నాయి. కానీ మన దేశంలో అరుదుగా మాత్రమే ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. మహావతార్ నరసింహ కథకు యానిమేషన్ సరైన ఎంపిక. కొందరు ఈ సినిమాను రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని చెప్పారు. కానీ అసలు బడ్జెట్ రూ. 40 కోట్లు. ఇందులో మార్కెటింగ్ కూడా ఉంది. మీకు సంకల్ప శక్తి ఉంటే, తక్కువ బడ్జెట్‌లో కూడా మరింత మంచి సినిమా తీయవచ్చు’ అని అశ్విన్ కుమార్ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .