Manchu Vishnu: అచితూచి మాట్లాడండి.. ఇచ్చే స్టేట్మేంట్స్ ఇండస్ట్రీపై పడుతుంది.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..
తెలుగు వాళ్లందరం కలిసి సినీ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. శుక్రవారం హైదరాబాద్‌లో
తెలుగు వాళ్లందరం కలిసి సినీ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంచు విష్ణుతోపాటు.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఈ వేడుకకు మా అధ్యక్షుడిగా రాలేదు.. కేవలం వ్యక్తిగతంగా మాత్రమే వచ్చాను. నాకు ప్రాంతీయంగా మాట్లాడటం తెలియదు.. తెలుగువాళ్లందరం కలిసి కట్టుగా ఉండాలి.. తెలుగు వాళ్ల ఆత్మ గౌరవం ఎక్కడ తగ్గినా అందరం ఒకటవ్వాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు. వాళ్లు మంచి పాలసీలతో ఇండస్ట్రీని కాపాడుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లం ఎవరిపైనా రాళ్లు విసరకూడదు..మేం మాట్లాడే విషయాల వలన ఇతరులు మాపై రాళ్లు విసరకూడదన్నారు. అలాగే మేం ఇచ్చే స్టేట్ మెంట్ ఏదైనా అచితూచి ఇవ్వాలి. ఇండస్ట్రీలో ఉన్నవారు ఇచ్చే స్టేట్ మెంట్స్ సినీ పరిశ్రమపై పడుతుంది. కాబట్టి అందరూ ఐక్యమత్యంగా ఉండి..అందరి తరపున స్టే్ట్ మెంట్ ఇవ్వాలన్నారు. లేదంటే.. వ్యక్తిగతంగా స్టేట్ మెంట్ ఇస్తున్నామని చెప్పుకొవాలి. నాకు ఎన్నికల్లో అండగా నిలబడి సలహాలు ఇవ్వడమే కాకుండా చాలా కాలంగా స్నేహంగా ఉన్నారు రామకృష్ణా గౌడ్. గురురాజ్. అందుకే ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరయ్యాను అన్నారు మంచు విష్ణు.
ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రతాని ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ కార్యక్రమాల్ని అందజేస్తామన్నారు మంత్రి.
RRR Movie: ఆ సన్నివేశంపై మరింత శ్రద్ద పెట్టి షూట్ చేసిన జక్కన్న.. ఫ్యాన్స్‌కు పూనకాలేనట..