Mahesh Babu MEK: మహేష్, ఎన్టీఆర్‌ల సందడికి సమయం ఆసన్నమైంది.. ఎవరు మీలో కోటీశ్వరులు టెలికాస్ట్ అయ్యేది..
Mahesh Babu MEK: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'. ఎపిసోడ్ ఎపిసోడ్‌కి వ్యూయర్ షిప్‌ను పెంచుకుంటూ పోతున్న ఈ షో దూసుకుపోతోంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్...
Mahesh Babu MEK: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ఎపిసోడ్ ఎపిసోడ్‌కి వ్యూయర్ షిప్‌ను పెంచుకుంటూ పోతున్న ఈ షో దూసుకుపోతోంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ వంటి గెస్ట్‌లు ఈ షోలో సందడి చేసిన విషయం తెఇలసిందే. వీరితో పాటు సమంత, మ్యూజిక్ సెన్సేషన్స్ తమన్ – దేవీశ్రీ హాజరయ్యారు. ఇక తాజాగా మరో స్టార్ హీరో ఈ షోలో సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. మహేష్ బాబు మీలో ఎవరు కోటీశ్వరులులో పాల్గొననున్నట్లు గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలను నిజం చేస్తూ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తెలుగులో ఇప్పటి వరకు ప్రసారమైన ఈ గేమ్ షోలో కంటెస్టెంట్ రూ. కోటి గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇదిలా ఉంటే షో నిర్వాహకులు ఈ ఎపిసోడ్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చేశారు. ఆదివారం కానుకగా ఈ ఎపిసోడ్‌ను డిసెంబర్ 5వ తేదీన ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని జెమెనీ టీవీ అధికారికంగా పంచుకుంది. మహేష్, ఎన్టీఆర్‌లు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు.. మీది, నాది మనందరిదీ సండే ప్లాన్ ఒకటే 08:30 నిమిషాలకు మీలో ఎవరు కోటీశ్వరులు చూడడం’ అంటూ ట్వీట్ చేశారు.
దీంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు, ఇటు మహేష్ ఫ్యాన్స్ షో కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఇద్దరు యంగ్ హీరోల మధ్య సాగే సరదా సంభాషణలు ఎలా ఉండనున్నాయో చూడాలి. ఇదిలా ఉంటే ఎవరు మీలో కోటీశ్వరులు తొలి సీజన్ రేపటితో ముగియనుంది. ఈ లెక్కన ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్‌ను చరణ్‌తో మొదలు పెట్టి మహేష్‌తో ముగిస్తున్నాడన్న మాట.
Evaru Meelo Koteeswarulu | Gemini TV Meedi, maadhi manandari sunday plan okate 8:30 Ki EMK chudatam#EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu pic.twitter.com/KFhuCX8Tne
— Gemini TV (@GeminiTV) December 4, 2021
Also Read: Natu Kollu: అనుమానస్పదంగా నాటుకోళ్లు మృతి.. కేసు నమోదు.. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిన పశు వైద్యులు
Android New Features: త్వరలో ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్లు.. వీటి ఉపయోగం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Priyanka Mohan: నిండు చందమామల అచ్చతెలుగు అమ్మాయి.. ‘ప్రియాంక మోహన్’ ఫొటోస్…