Natu Kollu: అనుమానస్పదంగా నాటుకోళ్లు మృతి.. కేసు నమోదు.. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిన పశు వైద్యులు
Natu Kollu: గుంటూరు జిల్లాలో నాటు కోళ్లు మృతి చెందడం కలకలం రేపింది. జిల్లాలోని పెదనందిపాడు మండలం నాగభైరువారి పాలెంకు చెందిన దండా అజయ్ కుమార్..
Natu Kollu: గుంటూరు జిల్లాలో నాటు కోళ్లు మృతి చెందడం కలకలం రేపింది. జిల్లాలోని పెదనందిపాడు మండలం నాగభైరువారి పాలెంకు చెందిన దండా అజయ్ కుమార్ నాటు కోళ్ల వ్యాపారం కొనగిస్తున్నాడు. అజయ్ కుమార్ పెంచుకుంటున్న 36 నాటు కోళ్లు అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాయి. దీంతో తన నాటు కోళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారని స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దాదాపు లక్ష రూపాయల నష్టం సంభవించిందని బాధితుడి వాపోయాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కోళ్లు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అంతేకాదు పోలీసులు అజయ్ కుమార్ కోళ్లు పెంచుకునే ఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామ నిర్వహించారు. పశువైద్యాధికారి అక్కడ నమూనాలు సేకరించారు. కోళ్ల మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి మృతి చెందిన కోళ్ల నమూనాలను పరీక్షల నిమిత్తం పశువైద్యులు గుంటూరు ల్యాబ్ కు పంపించారు.
నాటు కోడి గుడ్లు అరుదుగా లభిస్తాయి. ఇక పోషకాలు కూడా అధికంగా ఉండడంతో గుడ్ల ప్రియులకు నాటు కోడి గుడ్డు అంటే అమిత ఇష్టం. కరోనా నేపథ్యంలో నాటు కోడి గుడ్లకు మార్కెట్ లో డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రజలు పోషకాహారం వైపు దృష్టి సారించారు. దీంతో నాటు కోడి గుడ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. వీటి ధర ఎక్కువగా ఉన్నా… దొరికితే పోటీపడి మరీ కొనుగోలు చేస్తారు.
Also Read: హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో భక్తులకు అభయమిచ్చిన శ్రీ పద్మావతి అమ్మవారు