- Telugu News Photo Gallery Spiritual photos Tirupati: Sri Padmavathi Devi annual Kartika Brahmotsavams at Tiruchanoor
Tirupati: హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో భక్తులకు అభయమిచ్చిన శ్రీ పద్మావతి అమ్మవారు
Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ టీటీడీ అధికారులు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సల్లో నాలుగో రోజైన శుక్రవారం రాత్రి హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
Updated on: Dec 04, 2021 | 12:00 PM

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం రాత్రి హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.

కోవిడ్-19 నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.

హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది.

భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.

హనుమంతుని వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.





























