AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konijeti Rosaiah: రాజకీయాల్లో ఒక శకం ముగిసింది.. రోశయ్యకు నివాళి అర్పించిన మెగాస్టార్‌ చిరంజీవి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ‍్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం(డిసెంబర్‌ 4) కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Konijeti Rosaiah: రాజకీయాల్లో ఒక శకం ముగిసింది.. రోశయ్యకు నివాళి అర్పించిన మెగాస్టార్‌ చిరంజీవి..
Basha Shek
|

Updated on: Dec 04, 2021 | 12:51 PM

Share

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ‍్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం(డిసెంబర్‌ 4) కన్నుమూసిన సంగతి తెలిసిందే. 88 ఏళ్ల రోశయ్యకు ఉదయం ఒక్కసారిగా లో బీపీ రావడంతో ఆయన కుటుంబసభ్యులు అమీర్‌పేటలోని ఆయన నివాసం నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలోనే రోశయ్య తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. కాగా బంజారాహిల్స్‌ స్టార్‌ ఆస్పత్రి నుంచి రోశయ్య నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. కాగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న ఈ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన మెగాస్టార్‌ చిరంజీవి రోశయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళి అర్పించారు.

‘కొణిజేటి రోశయ్య మరణం తీవ్ర విషాదం. రాజకీయాల్లో ఆయనది భీష్మాచార్యుడి పాత్ర. ప్రజా జీవితంలో ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, సంప్రదాయాలు కాపాడడంలో ఓ రుషి మాదిరిగా సేవ చేశారు. వివాద రహితులుగా ప్రజల మన్ననలు అందుకున్నారు. నన్ను రాజకీయాల్లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. రోశయ్య కన్నుమూతతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని సంతాపం వ్యక్తం చేశారు చిరంజీవి.

Also read:

Konijeti Rosaiah: మాటల మాంత్రికుడు రోశయ్య.. అసెంబ్లీలో రాజకీయ ప్రత్యర్థులతో మాటల చెడుగుడు..

K Rosaiah Political Journey: కొణిజేటి రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు

West Bengal: బెంగాల్ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ధంఖర్