MAA Elections: ‘మా’ ఎన్నికల్లో కృష్ణంరాజు ఎంట్రీ .. కరోనా థర్డ్‌వేవ్ లేకపోతే సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ ?..
MAA Elections: సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి మూవీ ఆర్టిస్స్ట్ అసోషియేషన్ (మా) ఎన్నికలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా అధ్యక్ష పదివి కోసం ఆరుగురు..
MAA Elections: సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి మూవీ ఆర్టిస్స్ట్ అసోషియేషన్ (మా) ఎన్నికలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా అధ్యక్ష పదివి కోసం ఆరుగురు పోటీపడుతున్నారు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా రావు లతో ఓ కళ్యాణ్ కూడా ఎన్నికల అధ్యక్ష రేస్ లో ఉన్నారు. దీంతో ఎలక్షన్స్ డేట్ ప్రకటించకుండానే ఒకరిపై ఒకరు మాటలు తూటాలు విసురుతున్నారు. ఈసారి మా ఎన్నికల్లో లోకల్- నాన్ లోకల్ తో పాటు.. తెలంగాణ వాదంకూడా తెరపైకి వచ్చింది. అయితే మా ఎన్నికల వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కిరానున్నట్లు తెలుస్తోంది. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశం ఈ బుధవారం లేదా గురువారం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలని అనేది నిర్ణయం తీసుకోనున్నారు..
‘మా’ కొత్త కార్యవర్గం కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో వీరిని తొలగిస్తే కానీ ఎన్నికలు నిర్వహించలేమని ప్రస్తుత కార్యావర్గం తెలిపింది. దీంతో మూడో వేవ్ రాకపోతే మా ఎన్నికలు సెప్టెంబర్ లో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
అంతేకాదు ఈ సమావేశంలో మాలోని సభ్యుల జీవిత బీమాకు చెల్లించాల్సిన ప్రీమియంతో పాటు.. జీవిత సభ్యత్వాలను ఇవ్వటం వంటి అంశాలపై ఈసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ఈసీ సభ్యులతో పాటుగా క్రమశిక్షణా సంఘ ఛైర్మన్ కృష్ణంరాజు, న్యాయసలహాదారు, ఆడిటర్‌లు కూడా పాల్గొనున్నారు. అయితే ‘మా’ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత వర్చువల్‌గా ఈసీ మీటింగ్ జరగటం ఇదే తొలిసారి.
Also Read: డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్.. వ్యాక్సిన్ తీసుకున్నా వదిలిపెట్టని డెల్టా. అధ్యయనంలో షాకింగ్ విషయాలు