AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta Variant: డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్.. వ్యాక్సిన్ తీసుకున్నా వదిలిపెట్టని డెల్టా. అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Delta Variant: 2019 డిసెంబర్ చివరిలో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. కరోనా వైరస్ రోజుకో రకంగా మారుతూ.. ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కొన్ని దేశాల్లో..

Delta Variant: డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్.. వ్యాక్సిన్ తీసుకున్నా వదిలిపెట్టని డెల్టా. అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Delta Variant
Surya Kala
|

Updated on: Jul 27, 2021 | 11:45 AM

Share

Delta Variant: 2019 డిసెంబర్ చివరిలో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. కరోనా వైరస్ రోజుకో రకంగా మారుతూ.. ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కొన్ని దేశాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ అడుగు పెట్టగా.. మరికొన్ని దేశాల్లో నాలుగో దశకు చేరుకున్నాయి. గత వేరియెంట్స్ కంటే కరోనా వైరస్ డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తూ.. ప్రమాదకరంగా మారుతుంది. ఇతర కొవిడ్‌ వేరియంట్లతో రోగి ముక్కులో వైరల్‌ లోడు కన్నా వెయ్యిరెట్లు అధికంగా డెల్టా వేరియంట్‌ ఉంటుందని అధ్యయనం లో తెలిసింది. దీంతో ఇతర వేరియంట్ల కంటే ఈ డెల్టా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరిస్తోంది.

ఇంకా చెప్పాలంటే కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ వేసుకున్నవారిని కూడా ఈ డెల్టా వైరస్ వదిలిపెట్టడం లేదు.. దీంతో ప్రపంచ దేశాల్లో డెల్టా వైరస్ డేంజర్ బెల్స్ మ్రోగిస్తుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డెల్టా వేరియంట్ మునపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుంది. టీకా రెండు డోసులు తర్వాత ఇన్‌ఫెక్షన్‌ సోకే సత్తా డెల్టాకు ఉందని అధ్యయనాల్లో తేలింది. ప్రపంచానికి అతిపెద్ద ముప్పు డెల్టా వేరియంట్ అంటూ సైంటిస్టు షారన్‌ పీకాక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో ఎక్కువగా సోకుతుందనడానికి ఆధారాలు ఉన్నాయని.. ఈ వైరస్ సోకినవారు వారికి తెలియకుండానే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ డెల్టా వేరియంట్‌ను ‘ఫిట్‌ అండ్‌ ఫాస్ట్‌’గా అభివర్ణించారు.

కరోనాపై వచ్చిన టీకాల్లో అత్యంత ప్రభావవంతమైందిగా ఫైజర్‌ టీకాకు పేరుంది. అటువంటి ఈ ఫైజర్ టీకా కూడా డెల్టా వేరియంట్ పై 41 శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని గణాంకాల్లో తేలింది. డెల్టా వేరియంట్‌పై టీకాలు పెద్దగా ప్రభావం చూపడం లేదని రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇండోనేషియా వంటి దేశాల్లో రోజు రోజుకీ పెరుగుతున్న కేసులే సాక్ష్యం అంటున్నాయి..అంతేకాదు ఈ డెల్టా ప్రభావంతో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేసి ఆంక్షలు ఎత్తేసిన దేశాల్లో కూడా మళ్ళీ కఠిన ఆంక్షలు అమలు చేసే పరిస్థితులు ఏర్పడవచ్చునని నిపుణులు అంటున్నారు.

బ్రిటన్‌లో డెల్టా సోకినవారిలో దాదాపు 22 శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నవారే ఉన్నారు. సింగపూర్‌ . ఇజ్రాయిల్‌లో కరోనా బాధితుల్లో చాలామంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారే.. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా కొత్త కేసుల్లో 83 శాతం డెల్టా వేరియంట్‌ కేసులే . ఇక యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా డెల్టా వ్యాప్తి పెరిగిందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే మానవాళికి మరింత ముప్పు తప్పదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చిరిస్తుంది. ఏ క్షణంలోనైనా డెల్టా మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:  వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. నాన్‌వెజ్‌ ధరలతో పోటీపడుతూ కొండెక్కుతున్న కూరగాయల ధరలు..