Vegetable Price Rise: వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. నాన్‌వెజ్ ధరలతో పోటీపడుతూ కొండెక్కుతున్న కూరగాయల ధరలు..
Vegetable Price Rise: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. వర్షాలు, వరదలతో పంటలు నీట మునిగాయి. దీంతో కూరగాయల దిగుబడి..
Vegetable Price Rise: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. వర్షాలు, వరదలతో పంటలు నీట మునిగాయి. దీంతో కూరగాయల దిగుబడి పడిపోయింది. పంటలు దెబ్బతినడంతో కూరగాయల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. నాన్‌వెజ్ ధరలతో పోటీపడుతున్న కూరగాయల ధరలు అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు వాపోతున్నారు. కొన్ని కూరగాయల ధరలు కిలో రూ . 50 కి చేరువులో ఉన్నాయి. నిన్నమొన్నటివరకూ కిలో 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకూ ఉన్న కిలో కూరగాయలు వర్షాలతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొన్ని కూరగాయల ధరలు కిలోకు వంద రూపాయలకు చేరువలో ఉన్నాయి. మరికొన్ని 50 రూపాయాలకు తక్కువ కాకుండా ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఓ వైపు కరోనాతో అంతంత మాత్రంగా ఉన్న ఆర్ధిక పరిస్థితిలో సామాన్యులు, మధ్య తరగతివారు ఇప్పుడు పెరుగుతున్న కూరగాయల ధరలకు విలవిలలాడుతున్నారు. ఏమి కొనాలి, ఏమి తినాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి మార్కెట్‌లో టమాటా, ఉల్లి పాయి బీన్స్, బీరకాయ, పచ్చిమిర్చి, టమాటా ధరలు ఇలా అన్నీ రూ. 50 కి చేరుకున్నాయని మహిళాలు మండిపడుతున్నారు. కోడిగుడ్డు ఒకటి ఐదు రూపాయల పైనే ఉందని నాన్ వెజ్ తినలేము.. అలాగని ఇలా కూరగాయల ధరలు పెరుగుతుంటే కూరగాయలు కొనలేం అంటూ పేద. మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.