APJ Abdul Kalam: బెంగళూరు రైల్వే స్టేషన్ లో స్క్రాప్‌తో చేసిన అబ్దుల్ కలాం విగ్రహం.. సృజనాత్మకతకు నెటిజన్లు ప్రశంసల వర్షం
APJ Abdul Kalam Death Anniversary: నేడు భారత దివంగత రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. ఆయనకు భారత రైల్వే సంస్థ ఘన నివాళులర్పించింది. బెంగళూరులో స్క్రాప్‌తో..
APJ Abdul Kalam Death Anniversary: నేడు భారత దివంగత రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. ఆయనకు భారత రైల్వే సంస్థ ఘన నివాళులర్పించింది. బెంగళూరులో స్క్రాప్‌తో చేసిన ఎపిజె అబ్దుల్ కలాం విగ్రహం నెలకొల్పింది. ఈ మేరకు భారత రైల్వే సంస్థ తమ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసిన ఏపీజే అబ్దుల్ కలాం ఫోటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఎపిజె అబ్దుల్ కలాం ను స్క్రాప్ తో సృష్టించింది. భారత రైల్వే సౌత్ వెస్ట్రన్ రైల్వే (ఎస్డబ్ల్యుఆర్) జోన్ బెంగళూరులోని రైల్వే కోచింగ్ డిపోలో దివంగత శాస్త్రవేత్త యొక్క ప్రతిమను ఏర్పాటు చేసింది.
ఎపిజె అబ్దుల్ కలాం వర్ధంతికి నివాళిలర్పించింది. 7.8 అడుగుల ఎత్తైన అబ్దుల్ కలాం చిత్రాలను భారత రైల్వే సంస్థ ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది.ఈ విగ్రహం 800 కిలోల భారీ నిర్మాణం.. బోల్ట్స్, నట్స్, వైర్ రోప్స్, సోప్ కంటైనర్లు మరియు డంపర్ ముక్కలు వంటి స్క్రాప్ పదార్థాలతో తయారు చేయబడింది. ఈ విగ్రహాన్ని బెంగళూరులోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి తుమకూరు వైపు ప్రయాణించే ప్రయాణికులు చూడవచ్చు. అబ్దుల్ కలాం విగ్రహంతో పాటు స్వామి వివేకానంద విగ్రహం , మేక్ ఇన్ ఇండియా’ సింహాన్ని కూడా యశ్వంత్పూర్ కోచింగ్ డిపో బృందం నిర్మించింది.
The most creative tribute to the Missile Man & former President of India, Dr.A.P.J.Abdul Kalam by Yesvantpur Coaching Depot in SWR.
The 7.8 ft high & 800 kg heavy structure is fabricated entirely of scrap materials like Bolts,Nuts,Wire Ropes,Soap Containers & Damper pieces. pic.twitter.com/q0NoGQ2GVY
— Ministry of Railways (@RailMinIndia) July 22, 2021
కొంతమంది స్క్రాప్ విగ్రహాలను సృష్టించిన సుజనాత్మకపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు.. అలా స్క్రాప్ ను సేకరించిన ఓపికకాకు జోహార్లు అంటున్నారు. ఇప్పటికే ఈ పోస్ట్ భారీ లైక్స్ ను , షేర్స్ ను సొంతం చేసుకుంది. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ .. యూత్ కు ఆయన ఆదర్శం అంటూ నెటిజన్లు భారీగా నివాళులర్పిస్తున్నారు.