Maa Elections 2021: మా ఎన్నికల్లో మరో ట్విస్ట్.. ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రోజు రోజూకీ మరింత వేడెక్కుతున్నాయి. కేవలం ప్రచారాలు, ఆరోపణల వరకే ఉండే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రోజు రోజూకీ మరింత వేడెక్కుతున్నాయి. కేవలం ప్రచారాలు, ఆరోపణల వరకే ఉండే ఎన్నికలు..ఇప్పుడు ఫిర్యాదుల వరకు వెళ్లాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష పదవి కోసం పోటీ జరుగుతుంది. లోకల్, నాన్ లోకల్ అనే వాదనల నుంచి ప్రారంభమైన ఎన్నికలు.. ఒకరికపై మరొకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. అంతేకాకుండా.. ఈసారి మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతుండడంతో ఎన్నికలు మరింత హీటెక్కాయి. ఇక ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు అభ్యర్థులు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో మీడియా సమావేశాలు నిర్వహించగా.. సినీ పెద్దలను తన వైపుకు తిప్పుకునేందుకు మంచు విష్ణు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈరోజు మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో మా ఎన్నికలు మరింత హీటేక్కాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మా ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలి మంచు విష్ణు లేఖలో కోరారు. అలాగే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని మంచు విష్ణు తెలిపారు. ఈవీఎంలపై మా ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదని.. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారిని మంచు విష్ణు కోరారు. ఇక పేపర్ బ్యాలెట్ విధానంలో జరిగే పోలింగ్లో పారదర్శకత ఉంటుందని.. ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ చాలా ఉత్తమమైనదని విష్ణు పేర్కొన్నారు. పేపర్ బ్యాలెట్ కల్పిస్తే సీనియర్లు చాలా మంది ఓటు వేసే అవకాశం ఉంటుందని మంచు విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: MAA Elections 2021: మా లో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ పద్దతి.. కండిషన్స్ ఇవే..
MAA Elections 2021: ‘మా’ ఎన్నికల వార్.. కుట్ర జరుగుతోందని కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాష్ రాజ్..