MAA Elections 2021: ‘మా’ ఎన్నికల వార్.. కుట్ర జరుగుతోందని కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాష్ రాజ్..

మా ఎన్నికల వార్ హోరాహోరీగా నడుస్తుంది.. ఇప్పటికే ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ మా ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా మార్చేస్తున్నారు.

MAA Elections 2021: 'మా' ఎన్నికల వార్.. కుట్ర జరుగుతోందని కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాష్ రాజ్..
Prakash Raj
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 05, 2021 | 11:14 AM

maa Elections 2021: మా ఎన్నికల వార్ హోరాహోరీగా నడుస్తుంది.. ఇప్పటికే ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ మా ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా మార్చేస్తున్నారు. మా.. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకీ ఉత్కంఠ పెరిగిపోతోంది. అక్టోబర్‌ 10వ తేదీన మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే అధ్యక్ష పదవి రేస్‌లో ఉన్న ప్రకాష్‌రాజ్‌ తన ప్యానల్‌ను ప్రకటించగా… తాజాగా అధ్యక్ష రేస్‌లో ఉన్న మంచు వారబ్బాయి విష్ణు కూడా దూకుడు పెంచారు. ఇక ఇద్దరు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

అక్టోబర్ 10వ తేదీన జరుగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసుకుంటున్నారు. నరేష్ – ప్రకాష్ రాజ్ – విష్ణు- జీవితల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. 60 మందితో మంచు విష్ణు తనకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారని ఆరోపించారు.

పోస్టల్ బ్యాలెట్లతో  విష్ణు కుట్రచేస్తున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు. ఒక వ్యక్తికి 56 మంది డబ్బులు ఇచ్చారని.. తనకు అనుకూలంగా ఓటు వేయాలని కోరారని ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ వ్యవహారంపై మా ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ లో కుట్ర చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆలస్యమైనా అదరగొడతానంటున్న గోపీచంద్.. ఆకట్టుకుంటున్న ‘ఆరడుగుల బుల్లెట్’ ట్రైలర్..

Manchi Rojulochaie: మంచి రోజు చూసుకొని వస్తున్న మారుతి ‘మంచి రోజులొచ్చాయి’ సినిమా.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే.