ఆలస్యమైనా అదరగొడతానంటున్న గోపీచంద్.. ఆకట్టుకుంటున్న ‘ఆరడుగుల బుల్లెట్’ ట్రైలర్..
మ్యాచో స్టార్ గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''ఆరడుగుల బుల్లెట్''. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్

మ్యాచో స్టార్ గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”ఆరడుగుల బుల్లెట్”. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 8న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇటీవలే సీటీమార్ సినిమాతో హిట్ అందుకున్న గోపిచంద్ ఇప్పుడు ఈ సినిమాతావు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి వస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది.. కానీ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. మొన్నామధ్య సినిమా ఓటీటీలో విడుదల అవుతుందంటూ ప్రచారం జరిగింది. కానీ దర్శక నిర్మాతలు థియేటర్స్ కే మగ్గు చూపారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘పేరు శివ.. పుట్టింది బెజవాడ.. పెరిగింది హైదరాబాద్.. పరిచయమైతే నేను మర్చిపోను.. పంగా అయితే నువ్వు మర్చిపోలేవ్’ అని గోపీచంద్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. పనీ పాటా లేకుండా తిరుగుతూ తండ్రితో తిట్లు తినే కుర్రాడిగా హీరో క్యారెక్టరైజేషన్‌ని పరిచయం చేశారు. గోపీచంద్ తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించారు. ‘పోషించలేని వాడికి ప్రేమ ఎందుకు? పడి తినే వాడికి పౌరుషం ఎందుకు?’ అంటూ తిడుతుంటాడు. అవేమీ పట్టించుకోని గోపీచంద్ ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే విలన్ అభిమన్యు సింగ్ వల్ల తన తండ్రికి సమస్య ఎదురవడంతో గోపీచంద్ క్యారక్టర్ మరో టర్న్ తీసుకుంది. తండ్రి కోసం ఎంత దూరమైనా వెళ్లే కొడుకు విలన్స్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోడానికి ఏమేమి చేసాడు అనేది ఈ ట్రైలర్ లో చూపించారు. బి గోపాల్ గత చిత్రాల తరహాలోనే ‘ఆరడుగుల బుల్లెట్’ ని కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారని తెలుస్తోంది. నయన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. బాల మురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేశారు. ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రానికి దర్శక రచయిత వక్కంతం వంశీ కథ – స్క్రీన్ ప్లే అందించారు. అబ్బూరి రవి దీనికి డైలాగ్స్ రాశారు. కోట శ్రీనివాసరావు – బ్రహ్మానందం – జయ ప్రకాష్ రెడ్డి – చలపతిరావు – రమా ప్రభ తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :