Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: మా లో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ పద్దతి.. కండిష‌న్స్ ఇవే..

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు రోజు రోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఈ నెల 10న ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.

MAA Elections 2021: మా లో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ పద్దతి.. కండిష‌న్స్ ఇవే..
Maa
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 05, 2021 | 1:04 PM

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు రోజు రోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఈ నెల 10న ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరివురు తమ ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్స్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. మా లో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ పద్దతి. తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నిబంధనలను ప్రకటించారు..

1. పోస్టల్ బ్యాలెట్ కోసం 60 ఏళ్లు పైబడిన సభ్యులంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర శారీరక కారణాలు ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు.

2. స్పీడ్ పోస్ట్, కొరియర్ లేదా ఏజెంట్ ద్వారా 2021 సెప్టెంబర్ 25 నుంచి 30 సెప్టెంబర్ 2021 మధ్య ఎన్నికల అధికారికి సాదా కాగితంపై దరఖాస్తు చేసుకోవాలి.

3. ఆ దరఖాస్తులో జీవిత సభ్యత్వ నెంబర్, బ్యాలెట్ పేపర్ తప్పనిసరిగా పంపాల్సిన చిరునామా, ఫోన్ నంబర్, శారీరకంగా ఎందుకు అందుబాటులో లేకపోతున్నారో కారణం ప్రస్తావించాలి.

4. ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రత కొరకు, ఒక ఏజెంట్ ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తుదారులకు ప్రాతినిధ్యం వహించరు.

5. ఎన్నికల అధికారికి తిరిగి బ్యాలెట్ పత్రం వచ్చినప్పుడు అవునా కాదా అని నిర్థారించేందుకు అప్లికేషన్ పై ఉన్న సంతకం నమూనాగా తీసుకుంటారు.

6. ఎన్నికల అధికారి సరిచూసిన తర్వాత, బ్యాలెట్ పత్రాలు, ధృవీకరణ స్లిప్‌లను దరఖాస్తుదారులకు నేరుగా 4 అక్టోబర్ 2021న లేదా స్పీడ్ పోస్ట్ \ బ్లూ కొరియర్‌ ద్వారా పంపిస్తారు.

7. సభ్యులు, ఓటింగ్ సమ్మతిపై, సీల్డ్ కవర్‌లో బ్యాలెట్ పేపర్‌లను ఆఫీస్ చిరునామాకు స్పీడ్ పోస్ట్ \ బ్లూడార్ట్ ద్వారా 09-10-2021 లోపు పంపవచ్చు. 09-10-2021 తర్వాత వచ్చిన ఓట్లు తిరస్కరించబడతాయి.

8. పోలింగ్ అనేది ఒక రహస్య ప్రక్రియ, ఓటింగ్ పద్ధతి టిక్ మార్క్ ద్వారా రహస్య ఉల్లంఘన ఓట్ల రద్దుకు దారితీస్తుంది.

9. మా లో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ పద్దతి ప్రవేశపెట్టడం వల్ల ఊహించని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎవరివైనా దరఖాస్తులు తిరస్కరించడం తీసుకోవడం వంటి విషయాల్లో తగిన విధంగా ఎన్నికల అధికారి వ్యవహరించాలి. న్యాయస్థానానికి సంబంధించిన ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవు.

మరిన్ని నిబంధనలు…

1. ఒక అభ్య‌ర్థి ఒక పోస్టు కోసం మాత్ర‌మే పోటీ చేయాలి. 2. గ‌త క‌మిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ అయి ఉండి.. 50 శాతం కంటే త‌క్కువ మీటింగ్‌ల‌కు హాజ‌రైతే పోటీకి అన‌ర్హులు. 3. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేర‌ర్స్‌గా ఉన్న వారు మా ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే ఆ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలి. 4. అంద‌రూ క‌చ్చితంగా క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాలి 5. నామినేష‌న్ స‌మ‌ర్ప‌ణ‌, ఓటింగ్ స‌మ‌యంలో మాస్కు త‌ప్ప‌నిస‌రి 6. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ స‌దుపాయం 7. 60 ఏళ్లు దాటిన వారికే పోస్టల్ బ్యాలెట్ 8. పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్ అనుమ‌తి లేదు

మరిన్ని ఇక్కడ చదవండి :

MAA Elections 2021: సిని’మా’ వార్.. రాజకీయం, సవాళ్లు, ఆరోపణల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్లిన ‘మా’ సమరం..

హతవిధీ.. ఒకరితర్వాత మరొకరు.. టాలీవుడ్‌కి ఇదో కొత్త గండం..! ఎందుకిలా జరుగుతుంది..!!

Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం బరిలోకి దిగిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్…