హతవిధీ.. ఒకరితర్వాత మరొకరు.. టాలీవుడ్‌కి ఇదో కొత్త గండం..! ఎందుకిలా జరుగుతుంది..!!

వాడికి దెబ్బ తగలకుండా చిన్న యాక్సిడెంట్ జరగాలి... అని ఒక సినిమాలో హీరో గురించి హీరోయిన్ కోరుకున్న క్రేజీ కోరిక ఇది.

హతవిధీ.. ఒకరితర్వాత మరొకరు.. టాలీవుడ్‌కి ఇదో కొత్త గండం..! ఎందుకిలా జరుగుతుంది..!!
Tollywood

వాడికి దెబ్బ తగలకుండా చిన్న యాక్సిడెంట్ జరగాలి… అని ఒక సినిమాలో హీరో గురించి హీరోయిన్ కోరుకున్న క్రేజీ కోరిక ఇది. ఇలాంటివే చిన్నచిన్న యాక్సిడెంట్ వార్తలు టాలీవుడ్ స్టార్ డమ్‌ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకరు కోలుకోగానే మరొకరు ఆస్పత్రి బెడ్ ఎక్కుతున్నారు. ఇండస్ట్రీకి ఇదో రకం శాపమా అనే అనుమానం మరోవైపు.

నన్ను, నా సినిమానీ ఆశీర్వదించినందుకు థాంక్స్… ఇదిగో నేనొచ్చేస్తున్నా… అంటూ థమ్సప్ ఫోటోను షేర్ చేసి… ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమ కూడా ఊపిరి పీల్చుకునేలా చేశారు హీరో సాయిధరమ్ తేజ్. బైక్ యాక్సిడెంట్లో గాయపడి హాస్పిటల్లో వున్న తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు క్లారిటీ వస్తున్నా.. మొన్నీమధ్యే పవర్ స్టార్ నోటివెంట ‘కోమా’ అనే సౌండ్ విని మళ్ళీ ఉలిక్కిపడ్డారు అందరూ… తన ఆరోగ్యం పై ఎలాంటి డౌట్స్ వద్దు అంటూ సాక్ష్యంగా కనిపిస్తోంది తేజ్ థమ్సప్ ఫోటో.

మరోవైపు డెంగ్యూ ఫీవర్ బారిన పడి ప్లేట్ లెట్స్ పడిపోయిన రెండు వారాల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న అడివి శేష్ కూడా శ్రేయోభిలాషుల్ని టెన్షన్ పెట్టారు. మిస్టర్ గూఢచారీ… గెట్ వెల్ సూన్ అంటూ మెసేజెస్ వరదలా పోస్ట్ అయ్యాయి. ‘ఇక్కడ అంతా క్షేమం అంటూ సన్ ఫ్లవర్ లుక్‌లో కొత్త ఫోటో పోస్ట్ చేసి.. ఆల్ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు మేజర్ హీరో అడివి శేష్. అటు బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ కూడా షూటింగ్‌లో గాయపడ్డారు. మహాసముద్రం అనే సినిమా షూటింగ్ సమయంలో గాయం కావడంతో.. సిద్ధార్థ్ విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. సర్జరీ పూర్తయిన తర్వాత ఇటీవలే ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ మూడు స్వస్థత వార్తలతో టాలీవుడ్ ఖుషీ అవుతుంటే.. ఇస్మార్ట్ హీరో నుంచి మరో షాకింగ్ న్యూస్. బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ టైంలో గాయపడ్డా.. కొన్నిరోజుల పాటు చికిత్స తీసుకోవాలి మళ్ళీ కలుస్తా అంటూ నెక్ బ్యాండ్ ధరించిన ఫోటోతో షాక్ ఇచ్చారు రామ్ పోతినేని. ప్రస్తుతం లింగుసామి డైరెక్షన్లో తన 19వ సినిమాలో నటిస్తున్నారు రామ్.

(శ్రీహరి రాజా Tv9 ET desk)

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ‘మా’ ఎన్నికల వార్.. కుట్ర జరుగుతోందని కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాష్ రాజ్..

ఆలస్యమైనా అదరగొడతానంటున్న గోపీచంద్.. ఆకట్టుకుంటున్న ‘ఆరడుగుల బుల్లెట్’ ట్రైలర్..

Manchi Rojulochaie: మంచి రోజు చూసుకొని వస్తున్న మారుతి ‘మంచి రోజులొచ్చాయి’ సినిమా.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu