AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: వీకెండ్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’కి భారీ కలెక్షన్లు.. 4 రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?

మొదటి రోజు కంటే రెండో రోజు పెద్ది కలెక్షన్లు భారీగా తగ్గాయి. కానీ వీకెండ్ లో మళ్లీ పెద్ది దూకుడు పెంచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ మేరకు రామ్ చరణ్ సినిమా నాలుగు రోజుల వసూళ్లను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Peddi Movie: వీకెండ్‌లో రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ కలెక్షన్లు.. 4 రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Peddi Movie
Basha Shek
|

Updated on: Jun 08, 2026 | 12:48 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్ గా, కుస్తీ వీరుడిగా, బ్లేడ్ రన్నర్ గా అదరగొట్టాడు. సినిమా మొత్తం మెగా పవర్ స్టార్ వన్ మ్యాన్ షోలా సాగింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఇంటెన్స్ యాక్టింగ్ చూసేందుకే చాలా మంది ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు. దీంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పెద్ది సినిమా మొదటి రోజే రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రెండో రోజు కాస్త వసూళ్లు తగ్గినా వీకెండ్ లో పెద్ది ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఆదివారం (జూన్ 07) 250 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించిన పెద్ది ఓవరాల్ గా నాలుగు రోజుల్లో రూ. 292.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మేరకు కలెక్షన్ల వివరాలు వెల్లడిస్తూ పెద్ది నిర్మాతలు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మొత్తానికి నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్లకు చేరువైన పెద్ది మూవీకి సోమవారం పెద్ద పరీక్ష ఎదురు కానుంది. వీక్ డేస్ కావడం, స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ కావడంతో పెద్ది వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

ఇక ఓవర్సీస్ లోనూ పెద్ది సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే 2.7 మిలియన్స్ డాలర్లను కలెక్ట్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా పెద్ది సినిమాను నిర్మించారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించింది. అలాగే శివరాజ్ కుమార్ జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు అందించారు.

ఇవి కూడా చదవండి

300 కోట్లకు చేరువలో పెద్ది..

ఓవర్సీస్ లోనూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీకెండ్‌లో 'పెద్ది' దూకుడు.. 4 రోజుల కలెక్షన్ల వివరాలివే
వీకెండ్‌లో 'పెద్ది' దూకుడు.. 4 రోజుల కలెక్షన్ల వివరాలివే
చేప‌ల్లో గుడ్లు వ‌స్తే పారేస్తున్నారా? అందులోని పోషకాలు తెలిస్తే
చేప‌ల్లో గుడ్లు వ‌స్తే పారేస్తున్నారా? అందులోని పోషకాలు తెలిస్తే
తెలంగాణకు చల్లటి కబురు.. ఏపీలో ఎండలు, వానలు!
తెలంగాణకు చల్లటి కబురు.. ఏపీలో ఎండలు, వానలు!
విజయ్ కుమార్తె దివ్య గురించి ఆసక్తికర విషయాలు..
విజయ్ కుమార్తె దివ్య గురించి ఆసక్తికర విషయాలు..
చపాతీ కర్రతో వత్తే శ్రమ లేదు.. 5 నిమిషాల్లోనే 50 పూరీలు రెడీ!
చపాతీ కర్రతో వత్తే శ్రమ లేదు.. 5 నిమిషాల్లోనే 50 పూరీలు రెడీ!
చిన్నగా ఉన్నాయని చులకన వద్దు.. ప్రయోజనాలు తెలిస్తే..కేజీలు కేజీలు
చిన్నగా ఉన్నాయని చులకన వద్దు.. ప్రయోజనాలు తెలిస్తే..కేజీలు కేజీలు
వార్నీ.. అక్కడ ఎలా దాక్కున్నావ్ సామీ.. అరెస్ట్ భయంతో టీఎంసీ లీడర
వార్నీ.. అక్కడ ఎలా దాక్కున్నావ్ సామీ.. అరెస్ట్ భయంతో టీఎంసీ లీడర
బురద నీటిలో మహిళ చేతికి తగిలిన భారీ ఆకారం.. ఏంటా అని చూడగా..
బురద నీటిలో మహిళ చేతికి తగిలిన భారీ ఆకారం.. ఏంటా అని చూడగా..
ఒకడికి చెంచాలా నేనుండను..! గంభీర్‌కు ఇన్‌డైరెక్ట్ వార్నింగ్?
ఒకడికి చెంచాలా నేనుండను..! గంభీర్‌కు ఇన్‌డైరెక్ట్ వార్నింగ్?
అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. బాబూ మోహన్..
అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. బాబూ మోహన్..