AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చపాతీ కర్రతో వత్తే శ్రమ లేదు.. 5 నిమిషాల్లోనే 50 పూరీలు రెడీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ ట్రిక్!

ఇంట్లో ఎక్కువ మంది మనుషులు ఉన్నప్పుడు లేదా పండగల సమయంలో పూరీలు ఒక్కొక్కటిగా వత్తడం చాలా సమయం తీసుకుంటుంది. అయితే, చపాతీ కర్ర (బేలన్) అవసరం లేకుండానే కేవలం ఐదు నిమిషాల్లో 50 కి పైగా పూరీలను ఎంతో సులభంగా తయారు చేసే ఒక వినూత్న ట్రిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో ఎలా చేయాలో ఈ చిట్కా వివరిస్తుంది. ఈ పద్ధతి ద్వారా పూరీలన్నీ ఒకే పరిమాణంలో రావడమే కాకుండా, నూనెలో వేయగానే హోటల్ స్టైల్‌లో చక్కగా ఉబ్బి, మెత్తగా వస్తాయి.

చపాతీ కర్రతో వత్తే శ్రమ లేదు.. 5 నిమిషాల్లోనే 50 పూరీలు రెడీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ ట్రిక్!
Puri Recipe
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2026 | 12:34 PM

Share

బ్రేక్‌ఫాస్ట్ అనగానే చాలామంది ఇంట్లో మొదటి ప్రాధాన్యత పూరీ-ఆలూ కుర్మాకే ఇస్తారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, పూరీ చేయడం రుచిగా ఉన్నంత సులభం కాదు. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు లేదా బంధువులు వచ్చినప్పుడు.. చపాతీ కర్రతో ఒక్కొక్క పూరీని గుండ్రంగా వత్తుతూ, కాల్చడం అనేది గృహిణులకు పెద్ద శ్రమతో కూడిన పని. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన కిచెన్ హ్యాక్ వైరల్ అవుతోంది. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చపాతీ కర్రతో పనిలేకుండా కేవలం ఐదు నిమిషాల్లోనే 50 కి పైగా పూరీలను చకచకా చేసేయవచ్చు. ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ పద్ధతి కోసం ముందుగా పూరీ పిండిని ఎప్పటిలాగే కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్‌గా అయిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్లాస్టిక్ షీట్ లేదా క్లింగ్ ఫిల్మ్ తీసుకోవాలి. ఆ షీట్‌కు కొద్దిగా నూనె రాయాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఆ షీట్‌పై కొద్దిగా దూరం దూరంగా 4 నుండి 5 పిండి ముద్దలను ఉంచాలి. వాటిపై మరొక ప్లాస్టిక్ కవర్ వేయాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి, అడుగు భాగం చదునైన స్టీల్ గిన్నె లేదా పదునైన అంచులు లేని బరువైన ప్లేట్ తీసుకొని.. ఆ పిండి ముద్దలపై పెట్టి గట్టిగా ఒత్తాలి (ప్రెస్ చేయాలి). అంతే, ఒక్క క్షణంలోనే నాలుగైదు పూరీలు ఒకేసారి పర్‌ఫెక్ట్ రౌండ్ షేప్‌లో సిద్ధమైపోతాయి. ఇలా చేయడం వల్ల శ్రమ తగ్గడమే కాకుండా సమయం కూడా చాలా ఆదా అవుతుంది.

వీడియో ఇక్కడ చూడండి..

పూరీలు నూనెలో వేయగానే బెలూన్‌లా పొంగాలంటే పిండి కలిపేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిండి కలిపేటప్పుడు అందులో ఒక చెంచా ఉప్మా రవ్వ (బొంబాయి రవ్వ), కొద్దిగా కాచిన వేడి నూనె వేసి కలిపితే పూరీలు ఎక్కువ సేపు పొంగి ఉంటాయి. క్రిస్పీగా వస్తాయి. అలాగే పూరీలను వేయించేటప్పుడు నూనె చాలా వేడిగా (High Heat) ఉండాలి. నూనె సరిగ్గా కాగకపోతే పూరీలు పొంగవు, పైగా నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. ఈ సింపుల్ కిచెన్ ట్రిక్స్, వైరల్ హ్యాక్‌ను ఉపయోగించి మీరు కూడా ఈసారి తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి వేడివేడి పూరీలను అస్సలు అలసిపోకుండా వడ్డించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us