AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వార్నీ.. అక్కడ ఎలా దాక్కున్నావ్ సామీ.. అరెస్ట్ భయంతో టీఎంసీ లీడర్ ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు.. వీడియో వైరల్..

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేతలపై ప్రజాగ్రహం రోజురోజుకూ పెరిగిపోతోంది. హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారుల నుండి అక్రమంగా కమీషన్లు వసూలు చేశాడనే ఆరోపణలపై హౌరా పోలీసులు రంగంలోకి దిగడంతో.. టీఎంసీ నేత బ్రహ్మానంద చక్రవర్తి ఒక బట్టల దుకాణంలోని చీరల కుప్ప కింద దాక్కుని అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video: వార్నీ.. అక్కడ ఎలా దాక్కున్నావ్ సామీ.. అరెస్ట్ భయంతో టీఎంసీ లీడర్ ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు.. వీడియో వైరల్..
Tmc Leader Hides Under Pile Of Sarees
Krishna S
|

Updated on: Jun 08, 2026 | 1:46 PM

Share

తప్పు చేసినవాడు ఎక్కడ దాక్కున్నా దొరకక తప్పదు.. కానీ ఒక అధికార పార్టీ నేత ఏకంగా ఆడవాళ్లు కట్టుకునే చీరల కుప్ప కింద దూరి దాక్కున్న విచిత్ర సంఘటన పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసింది. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల నుండి అక్రమ కమీషన్లు వసూలు చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హౌరా జిల్లా ఉదయ్‌నారాయణ్‌పూర్ తృణమూల్ కాంగ్రెస్ నేత బ్రహ్మానంద చక్రవర్తిని పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. హౌరా జిల్లా బిల్‌సాపూర్ పరిధిలోని ఉదయ్‌నారాయణ్‌పూర్‌లో ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్లు మంజూరైన పేద ప్రజల నుండి బ్రహ్మానంద చక్రవర్తి భారీగా కమీషన్లు గుంజాడంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి తన కోసం వెతుకుతున్నారనే విషయం తెలుసుకున్న బ్రహ్మానంద.. తప్పించుకోవడానికి సమీపంలోని ఒక బట్టల దుకాణం గోడౌన్‌లోకి దూరాడు. అక్కడ భారీగా పేరుకుపోయి ఉన్న చీరల కుప్ప కింద దూరి నిశ్శబ్దంగా దాక్కున్నాడు.

పోలీసుల వేట.. దొరికిపోయిన బ్రహ్మానంద

పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందడంతో ఆ బట్టల గోడౌన్‌ను ముట్టడించారు. అక్కడ తనిఖీలు చేస్తుండగా ఒక చీరల కుప్ప దగ్గర అనుమానం వచ్చి, వాటిని ఒక్కొక్కటిగా పక్కకు జరపగా పర్పుల్ కలర్ షర్ట్ వేసుకుని లోపల దాక్కున్న బ్రహ్మానంద చక్రవర్తి బయటపడ్డాడు. పోలీసులు అతడిని కాలర్ పట్టుకుని బయటకు లాగి, అక్కడికక్కడే బేడీలు వేశారు. ఈ విచిత్రమైన అరెస్ట్ సీన్ అంతా అక్కడున్న వారు కెమెరాల్లో రికార్డ్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్థానిక బీజేపీ నేతల సమాచారం ప్రకారం.. ఇతనిపై 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాతి హింసాత్మక ఘటనలకు సంబంధించిన పాత కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

బెంగాల్ వ్యాప్తంగా ప్రజా తిరుగుబాటు.. గుడ్ల దాడులు..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి చవిచూసిన తర్వాత గతంలో అవినీతి, దౌర్జన్యాలకు పాల్పడిన స్థానిక టీఎంసీ నేతలపై ప్రజల్లో ఉన్న కోపం ఒక్కసారిగా బద్దలైంది. బెంగాల్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. జూన్ 6 శనివారం రాత్రి సీనియర్ టీఎంసీ నేత, ఎమ్మెల్యే మదన్ మిత్రా కాన్వాయ్‌పై కలకత్తాలో ప్రజలు కోడిగుడ్లతో దాడి చేశారు. అలాగే దోపిడీ కేసుల్లో అరెస్టయిన కౌన్సిలర్ బప్పాదిత్య దాస్‌గుప్తాను కోర్టుకు తీసుకెళ్తుండగా ప్రజలు గుడ్లు విసిరారు. కోపాగ్ని ఎంతలా ఉందంటే.. కోల్‌కతాలో జరగాల్సిన టీఎంసీ కౌన్సిలర్ల అత్యవసర సమావేశాన్ని సైతం గుడ్ల దాడి భయంతో పార్టీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

మంచం కింద ఒకడు.. చీరల కింద ఒకడు..

అయితే చక్రవర్తి ఘటన మరో అరెస్టును గుర్తుకు తెస్తోంది. కూచ్ బెహార్ జిల్లా మాతాభంగాలో ఇలాగే కట్ మనీ వసూలు చేసిన మరో టీఎంసీ నేత షాహిదుల్ మియాను గ్రామస్థులు తరుముకుంటూ వెళ్లగా.. అతడు తన ఇంట్లోని మంచం కింద దూరి దాక్కున్నాడు. పోలీసులు వచ్చి మంచం కింద నుండి అతడిని లాగి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెంగాల్‌లో అవినీతి నేతలపై సీబీఐ, ఎన్‌ఐఏ, స్థానిక పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో తప్పించుకోవడానికి నేతలు వెతుకుతున్న ఇలాంటి విచిత్రమైన దాగుడుమూతల దారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

వీడియో చూడండి..

Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!