AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దళపతి విజయ్ కుమార్తె దివ్య సాషా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కుమార్తె దివ్య సాషా గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. 2005లో జన్మించిన దివ్య, చిన్నతనంలోనే ‘థేరి’ సినిమాలో క్షణకాలం కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఉన్నత విద్యపై దృష్టి సారిస్తూ, స్టార్ కిడ్ అనే గుర్తింపుకంటే తనకంటూ ప్రత్యేకమైన భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నారు.

దళపతి విజయ్ కుమార్తె దివ్య సాషా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Vijay Daughter
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2026 | 12:40 PM

Share

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ కుటుంబం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆయన తమిళనాడు సీఎం అవ్వడం, భార్యతో విబేధాలు, నటి త్రిషతో రిలేషన్ నేపథ్యంలో నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. దీంతో విజయ్ సంతానం గురించి తెలుసుకునేందుకు కూడా నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన కుమార్తె దివ్య సాషా గురించి తెలుసుకోవాలని అభిమానులు తరచూ ఆసక్తి చూపుతుంటారు.

దివ్య సాషా 2005 సెప్టెంబర్ 9న చెన్నైలో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 20 సంవత్సరాలు. తమిళ సూపర్ స్టార్ విజయ్, సంగీతా సోర్నలింగం దంపతుల కుమార్తె అయిన దివ్య, చిన్నప్పటి నుంచే సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సినీ కుటుంబంలో జన్మించినప్పటికీ దివ్య సాషాకు సినిమాలతో పరిచయం చిన్న వయసులోనే ఏర్పడింది. 2016లో విడుదలైన విజయ్ బ్లాక్‌బస్టర్ చిత్రం “థేరి”లో క్లైమాక్స్ సన్నివేశాల్లో విజయ్ కుమార్తె పాత్రలో కొద్ది సేపు కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిన్న పాత్రతో సినీ ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ, ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ చదువుపైనే దృష్టి సారించారు.

విద్యాభ్యాసం విషయానికి వస్తే, దివ్య సాషా చెన్నైలోని ప్రముఖ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ (AISC)లో తన పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు సమాచారం. చదువుతో పాటు క్రీడల్లో సైతం కూడా ఆమె చురుకుగా పాల్గొన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో ఆమె పాఠశాల స్థాయిలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆమె సాధించిన విజయాలపై అధికారిక వివరాలు పెద్దగా అందుబాటులో లేవు.

ప్రస్తుతం దివ్య సాషా ఉన్నత విద్యను అభ్యసిస్తూ తన భవిష్యత్తు లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి విజయ్ సినీ రంగంలో అపారమైన ప్రజాదరణ పొందినప్పటికీ, దివ్య సాషా మాత్రం మీడియా దృష్టికి దూరంగా, నిరాడంబర జీవనశైలిని కొనసాగిస్తున్నారు.

సెలబ్రిటీ కుటుంబానికి చెందినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న దివ్య సాషా ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఆమె ఏ రంగాన్ని ఎంచుకుంటారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
టమాటా మొక్క పూత రాలిపోతుందా?.. ఈ చిన్న చిట్కా పాటించండి
టమాటా మొక్క పూత రాలిపోతుందా?.. ఈ చిన్న చిట్కా పాటించండి
అంబరాన్నంటుతున్న వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవ సంబరాలు
అంబరాన్నంటుతున్న వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవ సంబరాలు
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్: క్యూర్​ పరిధిలో ఊరిస్తున్న అదృష్టం..!
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్: క్యూర్​ పరిధిలో ఊరిస్తున్న అదృష్టం..!
రూ.1.50 కోట్ల చిట్టీల మోసం.. కష్టార్జితం కోల్పోయిన బాధితులకే ఐపీ
రూ.1.50 కోట్ల చిట్టీల మోసం.. కష్టార్జితం కోల్పోయిన బాధితులకే ఐపీ
బెండకాయ వేపుడు.. ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా కమ్మగా తింటారు
బెండకాయ వేపుడు.. ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా కమ్మగా తింటారు
ధన త్రయోదశి రోజు ఈ పని చేస్తే.. డబ్బే డబ్బు
ధన త్రయోదశి రోజు ఈ పని చేస్తే.. డబ్బే డబ్బు
వీళ్లకు మటన్ విషంతో సమానం.. అస్సలు తినకూడదు బాబోయ్..
వీళ్లకు మటన్ విషంతో సమానం.. అస్సలు తినకూడదు బాబోయ్..
ఏపీ మున్సిపల్ ఫలితాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్..
ఏపీ మున్సిపల్ ఫలితాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్..