AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: ‘అభి’ సినిమా హీరో గుర్తున్నాడా? ఒక చిన్న ఘటనతో 34 ఏళ్లకే హఠాన్మరణం.. ఏం జరిగిందో తెలుసా?

చేసింది తక్కువ సినిమాలే అయినా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి కుమార్ లాంటి సీనియర్ హీరోలతోనూ కలిసి నటించాడు. ఇతని నటనను చూసి యాక్టర్ గా ఎంతో మంచి భవిష్యత్ ఉందనుకున్నారు. కానీ విధి ఈ ట్యాలెంటెడ్ నటుడిని చాలా చిన్న చూపు చూసింది.

Actor: 'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? ఒక చిన్న ఘటనతో 34 ఏళ్లకే హఠాన్మరణం.. ఏం జరిగిందో తెలుసా?
Actor Kamalakar
Basha Shek
|

Updated on: Jun 08, 2026 | 12:12 PM

Share

2004లో రిలీజైన అభి సినిమా చాలా మందికి గుర్తుంటుంది. సినిమా యావరేజ్ గా నిలిచినా ఇందులోని పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అప్పటి టేప్ రికార్డర్లలో ఈ సాంగ్స్ మోత మోగిపోయాయి. ముఖ్యంగా ‘వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే’ అనే సాంగ్ అయితే మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. అలాగే ఎవరో అతనెవరో అనే మెలోడీ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ కు తెగ నచ్చేసింది. ఇక ఈ అభి సినిమాలో నటించిన హీరో పేరు కమలాకర్. పూర్తి పేరు బూచే పల్లి కమలాకర్ రెడ్డి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో బూచే పల్లి కుటుంబానికి మంచి పేరుంది. ఎంపీగా చాలా కాలం పాటు సేవలందించిన బూచే పల్లి సుబ్బా రెడ్డి కుమారుడే ఈ కమలాకర్.  అలాగే 2009లో  దర్శి ఎమ్మెల్యేగా గెలుపొందిన శివ ప్రసాద్ రెడ్డి ఈ కమలాకర్ స్వయనా సోదరుడు అవుతాడు. ఇప్పటికీ ఆ ఫ్యామిలీ రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన కమలాకర్ రాజకీయాలను కాదనుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమా ‘అభి’తోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో అతను పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించి ఆడియెన్స్ ను మెప్పించాడు. సినిమా కూడా మంచి విజయం సాధించింది.

అభి తర్వాత హాసిని, సన్నీ, సంచలనం సినిమాల్లో హీరోగా నటించాడు కమలాకర్. అలాగే సాయి కుమార్ లాంటి సీనియర్ హీరోలతోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. దీంతో కమలాకర్ నటనను చూసి యాక్టర్ గా ఎంతో మంచి భవిష్యత్ ఉందనుకున్నారు. కానీ విధి మరోలా తలంచింది. ఈ ట్యాలెంటెడ్ నటుడిని చాలా చిన్న చూపు చూసింది.

కమలాకర్ నటించిన ఐదో చిత్రం బ్యాండ్ బాలు. షూటింగ్ కూడా పూర్తయ్యి రిలీజ్ కు రెడీగా ఉంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ లో ఆడియో రిలీజ్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఇక్కడే చిన్న ప్రమాదం జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతుండగానే హీరో కమలాకర్ ప్రమాదవశాత్తూ జారి కింద పడి పోయారు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చాలా రోజులు చికిత్స పొందారు. కానీ కోలుకోలేకపోయారు. చివరకు 2013 జులై 14న గుండె పోటు తో తుది శ్వాస విడిచాడు కమలాకర్. అప్పటికింకా అతని వయసు కేవలం 34 ఏళ్లే కావడం శోచనీయం. కమలాకర్ భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ఇవి కూడా చదవండి

భార్య, పిల్లలతో నటుడు కమలాకర్..

Actor Kamalakar Family

Actor Kamalakar Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మామిడి ఒరుగులు ఇలా తయారు చేసుకోండి.. భలే ఉంటాయ్..
మామిడి ఒరుగులు ఇలా తయారు చేసుకోండి.. భలే ఉంటాయ్..
'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? 34 ఏళ్లకే ఎలా చనిపోయాడో తెలుసా?
'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? 34 ఏళ్లకే ఎలా చనిపోయాడో తెలుసా?
మధ్యాహ్నం కునుకు తీసే ముందు ఇది తెలుసుకోండి.ఈ సమయం దాటితే ప్రమాదం
మధ్యాహ్నం కునుకు తీసే ముందు ఇది తెలుసుకోండి.ఈ సమయం దాటితే ప్రమాదం
తెల్లసొన vs పచ్చసొన.. గుడ్డులో ఏ భాగం తింటే ఆరోగ్యానికి మంచిది..?
తెల్లసొన vs పచ్చసొన.. గుడ్డులో ఏ భాగం తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఏంటీ పిచ్చి రాతలు అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..
ఏంటీ పిచ్చి రాతలు అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..
టూర్‌ వెళ్లి ఇంటికొచ్చిన ఫ్యామిలీ.. కార్ రూఫ్ బాక్స్ ఓపెన్ చేయగా
టూర్‌ వెళ్లి ఇంటికొచ్చిన ఫ్యామిలీ.. కార్ రూఫ్ బాక్స్ ఓపెన్ చేయగా
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఈ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఈ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..
కూరగాయల్లో కంటికి కనిపించని పురుగులు,వండే ముందు ఇలా క్లీన్ చేయండి
కూరగాయల్లో కంటికి కనిపించని పురుగులు,వండే ముందు ఇలా క్లీన్ చేయండి
ముంబై ఇండియన్స్‌కు సూర్య గుడ్ బై?
ముంబై ఇండియన్స్‌కు సూర్య గుడ్ బై?
3 నెలల ముందు తెలిస్తే ఆ సినిమాలో భాగమయ్యేవాడిని.. కమల్ హాసన్..
3 నెలల ముందు తెలిస్తే ఆ సినిమాలో భాగమయ్యేవాడిని.. కమల్ హాసన్..