Tollywood: ఇద్దరు హీరోలతో ప్రేమ, బ్రేకప్.. సినిమాలు లేకపోయిన రూ.280 కోట్లు సంపాదన.. ఎవరీ హీరోయిన్..
ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటింగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం రూ.280 కోట్లు సంపాదించింది. ఇంతకీ ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ?

దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కనిపించి విమర్శకులను మెప్పించింది. కానీ సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలిచింది. రెండు సార్లు ప్రేమ, బ్రేకప్ కారణంగా కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రావడం లేదు. కానీ ఆస్తులు మాత్రం రూ.280 కోట్లు ఉన్నాయట. సినిమాలు కాకుండా ప్రకటనలు, వ్యాపార రంగాల్లో పెట్టుబడులతో ఎక్కువగా ఆస్తులు సంపాదించింది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ఇంకెవరు లేడీ సూపర్ స్టార్ నయనతార.
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ నయనతార.. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి సరోగసి ద్వారా కవలలు జన్మించారు. నయన్, విఘ్నేశ్ దంపతులు విలాసవంతమైన జీవనశైలితో కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.230 కోట్లు. ఇక ఆమె భర్త ఆస్తులు రూ.50 కోట్లు అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే చెన్నైలో నయన్ దంపతులు ఖరీదైన హోమ్ స్టూడియోను నిర్మించారు. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ (AD) ఇండియాలో ఒక ప్రత్యేక ఫీచర్ ద్వారా వారి ఆలోచనకు తగినట్లుగా ఇంటిని నిర్మించారు.
చెన్నైలోని వీనస్ కాలనీలో ఉన్న 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించారు. ఎత్తైన పైకప్పులు, గాజు ముఖభాగాలు పుష్కలమైన సహజ కాంతితో, ఈ స్థలం వెచ్చని, మట్టి సౌందర్యాన్ని కొనసాగిస్తూ పాత ప్రపంచ బ్రిటిష్ ఆకర్షణను వెదజల్లుతుంది. ఇందులో కాన్ఫరెన్స్ రూమ్, అతిథుల కోసం లాంజ్ స్థలం, ఇంటి వెనుక ఖాలీ డైనింగ్ హాల్.. సమావేశ గది, నయనతార, విఘ్నేష్ ఇద్దరికీ ప్రత్యేక వర్క్‌స్పేస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం నయన్.. సిద్ధార్థ్, ఆర్. మాధవన్‌లతో కలిసి మూకుత్తి అమ్మన్ 2 చిత్రంలో నటిస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..