Natural Star Nani : చరణ్‌కు బన్నీకి ఓకే.. మరి ఈ నేచురల్ స్టార్‌కి అది కలిసొస్తుందా..?

టాలీవుడ్ హీరోలంతా ట్రెండ్ మారుస్తున్నారు. నయా ట్రెండ్ ను కంటిన్యూ అవుతూ హిట్స్ అందుకుంటున్నారు. ఒకప్పుడు లవర్ బాయ్స్ గా కనిపించిన హీరోలంతా మాస్ మసాలా క్యారెక్టర్స్ లోకి ట్రాన్ఫర్ అవుతున్నారు

Natural Star Nani : చరణ్‌కు బన్నీకి ఓకే.. మరి ఈ నేచురల్ స్టార్‌కి అది కలిసొస్తుందా..?
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 28, 2022 | 3:37 PM

టాలీవుడ్ హీరోలంతా ట్రెండ్ మారుస్తున్నారు. నయా ట్రెండ్ ను కంటిన్యూ అవుతూ హిట్స్ అందుకుంటున్నారు. ఒకప్పుడు లవర్ బాయ్స్ గా కనిపించిన హీరోలంతా మాస్ మసాలా క్యారెక్టర్స్ లోకి ట్రాన్ఫర్ అవుతున్నారు. చిన్న హీరోలే కాదు పెద్ద హీరోలు కూడా మాస్ మూవీస్ చేయడానికి రెడీ అవుతున్నారు. కుర్ర హీరో రామ్ మొన్నటివరకు లవర్ బాయ్ గా సినిమాలు చేశాడు. కానీ ఉన్నట్టుంది ఇస్మార్ట్ శంకర్ అంటూ ఊర మాస్ లుక్ లోకి మారి భారీ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిట్టిబాబు అంటూ రంగస్థలంలో  అద్భుతంగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అలాగే రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప కోసం మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. మునుపెన్నడూ కనిపించని మాస్ లుక్ లో బన్నీ ఇరగదీశాడు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాడు నేచురల్ స్టార్ నాని.

నాని లేటెస్ట్ గా నటిస్తోన్న సినిమా దసరా. ఈ సినిమాలో నాని ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై ఇంట్రస్ట్ ను క్రియేట్ చేశాయి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమ సింగరేణి గనుల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమా కోసం నాని పూర్తిగా తన లుక్ ను మార్చేశాడు. జుట్టు, గడ్డం పెంచి మట్టికొట్టుకుపోయిన బట్టలు వేసుకొని డిఫరెంట్ గా కనిపించనున్నాడు. మరి చరణ్ కు బన్నీకి సక్సెస్ ను తెచ్చిపెట్టిన మాస్ గెటప్స్ నాని కి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి
Dasara

Dasara

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి