Tollywood: ప్రముఖ దర్శకుడి ఇంట విషాదం.. వెంటనే అతడి ఇంటికి సెలబ్రిటీలు
సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు బాబీకి పితృవియోగం కలిగింది.
సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు బాబీకి పితృవియోగం కలిగింది. దర్శకుడు బాబీ (రవీంద్ర) తండ్రి కొల్లి మోహన రావు(Mohana Rao)అనారోగ్యంతో కన్నుమూశారు. మోహన రావు (69) గత కొంత కాలం గా హైదరాబాద్ లోని ఒక ప్రెవేట్ ఆసుపత్రిలో కాలేయ సంబంధిత సమస్యతో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఈ రోజు( ఆగస్టు 28న) మధ్యాహ్నం 12.15 గంటలకు తుది శ్వాస విడిచారు. రేపు ఆయన స్వగ్రామం గుంటూరు లోని నాగారం పాలెం లో అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
తండ్రి మరణంతో బాబీ దిగ్బంతికి గురయ్యారు. కుటుంబసభ్యులంతా కనీరు మున్నీరవుతున్నారు. పలువురు సినిమా ప్రముఖులు ఫోన్ ద్వారా బాబీకి ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం బాబీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.