Liger : గుజరాత్‌లో రెండో రోజు సందడి చేసిన లైగర్ టీమ్.. విజయ్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే
పంజా విసరడానికి లైగర్ రెడీ అవుతున్నాడు. ఆగస్టు 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పూరీజన్నాథ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పంజా విసరడానికి లైగర్ రెడీ అవుతున్నాడు. ఆగస్టు 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పూరీజన్నాథ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటేప్రేక్షకుల్లో ఒక ఆసక్తి మొదలవుతుంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో దుమ్మురేపిన పూరి ఇప్పుడు లైగర్ తో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది లైగర్ టీమ్. ఇప్పటికే పలు నగరాల్లో పర్యటించి సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు టీమ్.
ఇటీవలే గుజరాత్ లో పర్యటించింది లైగర్ టీమ్. రెండు రోజుల పాటు లైగర్ టీమ్ గుజరాత్ లో పర్యటించారు. ఇక అక్కడి అభిమానులు విజయ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. విజయ్ ను చూడటానికి ఫ్యాన్స్ భారీగా వచ్చారు. అమ్మాయిలు కూడా భారీ సంఖ్యలో రావడం విశేషం. ఇక గుజరాత్ విజయ్ క్రీజ్ చూస్తే మతిపోవాల్సిందే. విజయ్ ను చూసిన ఫ్యాన్స్ ఈలలు, గోలలతో హోరెతించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక లైగర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని నగరాల్లో లైగర్ టీమ్ పర్యటిస్తోంది చిత్రయూనిట్.
Day 2 of Gujarat FANDOM TOUR at Vadodara shares electrifying love, breathtaking moments and Forever memories ?
Team #LIGER loves #Gujarat ❤️#LigerOnAug25th ?@TheDeverakonda @ananyapandayy #PuriJagannadh @karanjohar @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies pic.twitter.com/zIlJa3gIt5
— Puri Connects (@PuriConnects) August 10, 2022