sathish vajra: కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం.. నటుడి దారుణ హత్య
కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్, యూట్యూబర్ సతీశ్ వజ్ర హత్యకు గురయ్యాడు.

కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్, యూట్యూబర్ సతీశ్ వజ్ర(sathish vajra) హత్యకు గురయ్యాడు. ఆయన బావమరిదే ఆ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులో RR నగర్ పరిధిలోని బసవనగుడి ప్రాతంంలోని తన ఇంట్లో రక్తమడుగులో ఉన్న సతీశ్‌ను పొరుగున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. శనివారం ఈ హత్య జరిగింది. సొంతంగా సెలూన్ నిర్వహిస్తున్న సతీశ్‌కు చా లా మంది హీరోలు కస్టమర్లుగా ఉన్నారు. కన్నడ చిత్రంలో లగోరితో పాటు కొన్ని సీరియల్స్‌లోనూ సతీశ్ నటించారు. సొంతంగా ఒక యూట్యూబ్ చానెల్ కూడా ఆయన నిర్వహిస్తున్నారు. సతీశ్ వయస్సు 36 సంవత్సరాలు. మండ్యా ప్రజ్వల్ దేవరాజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు.
సతీశ్ భార్య 8 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి సతీష్ వేధింపులు కారణమని ఆమె సోదరులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇప్పడుు సతీశ్ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. సతీశ్ బావమరిదితో పాటు మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి