Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా ఆ సీనియర్ హీరోను దింపనున్న అనిల్ రావిపూడి
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమానుంచి త్వరలోనే అదిరిపోయే ఆప్డేట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు బాలయ్య.
ఇప్పటికే బాలయ్య సినిమా కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తాడట అనిల్. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు కావాల్సినంత కామెడీ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్ ను రంగంలోకి దింపనున్నాడట అనిల్. రాజశేఖర్ హీరోగా నటిస్తూనే విలన్ గా ను మెప్పించడానికి రెడీగా ఉన్నానని ఇప్పటికే అనౌన్స్ చేశారు రాజశేఖర్. దాంతో రాజశేఖర్ ను బాలయ్య సినిమా కోసం అనిల్ రావిపూడి ఒప్పించినట్టుగా తెలుస్తోంది.ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి