Ram Charan: చరణ్ ఆ యాక్షన్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చాడా..? శంకర్ సినిమా తర్వాత..
విక్రమ్ సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయిన లోకేష్ కనగరాజన్ తాజాగా ఓ ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు.
విక్రమ్ సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయిన లోకేష్ కనగరాజన్ తాజాగా ఓ ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు. రామ్ చరణ్(Ram Charan) తో సినిమా కన్ఫర్మ్‌గా ఉంటుందని చెప్పి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యేలా చేస్తున్నారు. మాస్టర్ సినిమా కంటే ముందే చెర్రీతో సినిమా చేసేందుకు రెడీ అయిన లోకీ.. ఫస్ట్ మాస్టర్ సినిమా ఫినిష్ చేయాలని ఆ తరువాత కమల్‌తో విక్రమ్ సినిమా చేయాల్సి ఉందని ఆ వీడియోలో చెప్పారు. ఈ రెండు సినిమాల తరువాతే చెర్రీతో సినిమా ఉంటుందని అప్పుడే క్లారిటీ ఇచ్చారు లోకీ.
ఇక చెప్పినట్టే లోకీ మాస్టర్ అండ్ విక్రమ్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్టు కొట్టి చెర్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. కాని చెర్రీ ఎట్ ప్రజెంట్ శంకర్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూట్ ఫినిష్ చేశాకే చెర్రీ.. లోకీ ప్రాజెక్ట్‌లోకి ఏంట్రీ ఇచ్చే ఇస్తారనే టాక్ ఈ వీడియోతో పాటే వినిపిస్తోంది. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటించాడు చరణ్. మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఇప్పుడు చరణ్ తో ఓ సాలిడ్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారట కొరటాల. మరో వైపు కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి