Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

My Dear Bootham : ‘మై డియర్ భూతం’గా ఇండియన్ మైకేల్ జాక్సన్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రభుదేవా ఫస్ట్ లుక్ పోస్టర్

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా(Prabhudeva)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్ గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి తనలో దాగి ఉన్న టాలెంట్ బయటపెట్టారు.

My Dear Bootham : 'మై డియర్ భూతం'గా ఇండియన్ మైకేల్ జాక్సన్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రభుదేవా ఫస్ట్ లుక్ పోస్టర్
Prabhudeva My Dear Bootham
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 20, 2022 | 5:27 PM

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా(Prabhudeva)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్ గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి తనలో దాగి ఉన్న టాలెంట్ బయటపెట్టారు. ఇక నటుడిగా ఎన్నో సినిమాల్లో వెండితెరపై ప్రభు దేవా మార్క్ కనిపించింది. ఇటీవల బాలీవుడ్ లో వరుస సినిమాలు డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ప్రభుదేవా ప్రధాన పాత్రలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభు దేవా నటిస్తోన్న కొత్త సినిమా ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకుమించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

ఇందులో భాగంగా తాజాగా ఈ మై డియర్ భూతం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటిస్తున్నారు. ఓ మంచి మెసేజ్ ఇస్తూ జీనీకి కిడ్స్‌కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ అలరించనుందట. జీనీ పాత్రలో ప్రభుదేవా ఒదిగిపోయారని, ఆయన లుక్ ఎంతో పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని.. ఈ మేకోవర్ నాచురల్‌గా ఉండాలని ఎంత కష్టపడ్డారో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన లుక్ చూస్తే అర్థమవుతోంది. ఈ లుక్ కోసం ఎలాంటి విగ్ వాడకపోవడం విశేషం. ప్రభు దేవా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించేలా ఈ మూవీ రూపొందిస్తున్నామని దర్శకనిర్మాతలు అన్నారు. ఈ మై డియర్ భూతం చిత్రంలో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా.. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ అబ్బురపరచనుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అతి త్వరలో ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి
Prabhudeva

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి