RIP Krishna garu: సినిమా రంగానికి కృష్ణ చేసిన సేవలు అజరామరం.. సూపర్ స్టార్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన కేటీఆర్

తీవ్రఅనారోగ్యం కారణంగా సూపర్ స్టార్ కృష్ణ హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. కార్డియాక్ అరెస్ట్ తోపాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో కృష్ణ గారను మరణించారని వైద్యులు తెలిపారు.

RIP Krishna garu: సినిమా రంగానికి కృష్ణ చేసిన సేవలు అజరామరం.. సూపర్ స్టార్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన కేటీఆర్
Krishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 15, 2022 | 9:14 AM

నటశేఖర కృష్ణ మరణం సినీలోకాన్ని మూగబోయేలా చేసింది. ఐదున్నర దశాబ్దాలు తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలిన సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. తీవ్రఅనారోగ్యం కారణంగా సూపర్ స్టార్ కృష్ణ హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. కార్డియాక్ అరెస్ట్ తోపాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో కృష్ణ గారను మరణించారని వైద్యులు తెలిపారు. కృష్ణకు మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. దాంతో ఆయన తెల్లవారు జామున 4గంటల9 నిమిషాలకు మరణించారు. కృష్ణ మృతిపై సినీ ప్రముఖులంతా నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా కృష్ణ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కే తారకరామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహ పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సృష్టించుకున్నారన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్న కేటీఆర్, కృష్ణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మహేష్ బాబుతో కేటీఆర్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి