ఫ్యాటీ లివర్ డైట్.. కాలేయ ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారాలు ఇవే!
Samatha
26 January 2026
మానవ శరీరంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే కాలేయ ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు.
కాలేయం
కాలేయం శరీరం నుంచి విషాన్ని బయటకు పంపి, జీవక్రియ, శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను నిలువ చేస్తుంది.
వ్యర్థాలను బయటకు పంపడం
ఈ మధ్యకాలంలో చాలా మంది కాలేయంలో అదనపు కొవ్వు పేరుకపోయి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీని వలన ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
అదనపు కొవ్వు
అందువలన అసలు కాలేయంలో అదనపు కొవ్వుతో బాధపడే వారు ఎలాంటి ఆహారాలు తమ డైట్‌లో చేర్చుకోవాలి. దీనికి సంబంధంచిన బెస్ట్ ఫుడ్ ఏదో చూద్దాం.
లైఫ్ స్టైల్
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పాల కూర, కాలే, వంటి వాటిల్లో పాలీఫెనాల్స్, నైట్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి కాలేయంలోని కొవ్వును తగ్గిస్తాయి.
ఆకుకూరలు
కాయధాన్యాలు, చిక్ పీస్, బఠానీలు, సోయా ఉత్పత్తుల వంటి వాటిల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వలన ఇవి కాలేయ కణజాలాన్ని కాపాడి, కొవ్వును తగ్గిస్తాయి.
కాయ ధాన్యాలు
సాల్మాన్, సార్డిన్స్, ట్యూనా, ట్రౌట్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి కాలేయ వాపు, కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సాల్మాన్ ఫిష్
వాల్ నట్స్, బాదం, తృణధాన్యాలు , పొద్దు తిరుగుడు విత్తనాలను మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇవి కాలేయ పనితీరును మెరుగు పరిచి, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.