Krithi Shetty: గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేస్తానంటున్న బేబమ్మ.. కృతి శెట్టి ఆసక్తికర కామెంట్స్..
మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఫస్ట్ మూవీతోనే

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఫస్ట్ మూవీతోనే స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది కృతి శెట్టింది. ఉప్పెన రీలిజ్ కావడానికి ముందే కృతి శెట్టి తెలుగు నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది కృతి శెట్టి. ఇటీవల నాని, సాయి పల్లవి జంటగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బంగార్రాజు సినిమాతో సంక్రాంతికి సందడి చేయడానికి రాబోతుంది.
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఇందులో రమ్యకృష్ణ, అక్కినేని నాగచైతన్యతోపాటు.. కృతి శెట్టి కీలకపాత్రలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో బంగార్రాజు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కృతి శెట్టి మీడియాతో ముచ్చటించిది. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ.. నేను చదివిన సైకాలజీ సినిమా రంగానికి బాగా ఉపయోగపడింది. సైకాలజీ స్టూడెంట్‌గా అందర్నీ గమనిస్తుంటాను. నాగార్జున సార్ షాట్ లేనప్పుడు చాలా క్లాసీగా మాట్లాడతారు. షాట్ రెడీ అనగానే వెంటనే పాత్రలో లీనమవుతారు.. అది చాలా గ్రేట్. రమ్యకృష్ణగారి నుంచి కూడా చాలా నేర్చుకున్నాను.
నేను గ్లిజరిన్ లేకుండానే ఏడుపు సీన్స్ చేస్తాను. నటిగా ఎదగడానికి ఉపయోగపడే నాకు నచ్చిన పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. నాకు సంక్రాంతి గురించి పెద్దగా తెలీదు. కానీ బంగార్రాజు చేస్తున్న సమయంలో తెలిసింది. సంక్రాంతికి ఏ సినిమా విడుదలైన మూవీస్ చూస్తామని నాకు తెలిసిన తెలుగు వారు చెప్పారు. ఇక్కడి వారు సినిమాలను ఎంతగా ప్రేమిస్తారో తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి.
Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..
