Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‌తో అనుష్క పెళ్లి.. కృష్ణంరాజు సతీమణి ఏమన్నారంటే..

ప్రస్తుతం టాలీవుడ్‌లో ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే ఠక్కున గుర్తకు వచ్చే పేరు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ (Prabhas).

Prabhas: ప్రభాస్‌తో అనుష్క పెళ్లి.. కృష్ణంరాజు సతీమణి ఏమన్నారంటే..
Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Mar 09, 2022 | 8:46 AM

ప్రస్తుతం టాలీవుడ్‌లో ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే ఠక్కున గుర్తకు వచ్చే పేరు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ (Prabhas). వరుసగా పాన్‌ఇండియా సినిమాలతో దూసుకెళుతోన్న ఈ స్టార్‌ హీరో పెళ్లిపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఎందులోనూ క్లారిటీ ఉండడం లేదు. తాజాగా రాధేశ్యామ్‌ సినిమా ప్రమోషన్లలోనూ తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఎదురయ్యాయి. దీంతో ‘ప్రేమపై నా అంచనాలు తప్పాయి’, ‘లవ్‌ ఫెయిల్యూర్‌’ అంటూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఈక్రమంలో తమ స్టార్‌ హీరో ఎప్పుడు ఏడడుగులు వేస్తాడా? అని ప్రభాస్‌ అభిమానులతో పాటు జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ప్రభాస్‌ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి డార్లింగ్‌ పెళ్లిపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేశారు. దీంతో పాటు ఎప్పటి నుంచో వినిపిస్తోన్న ప్రభాస్‌- అనుష్కల పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చారు.

అప్పుడే ప్రభాస్‌ పెళ్లి..

‘ప్రభాస్‌కి మన సంస్కృతి సంప్రదాయాలన్నా, మహిళలన్నా ఎంతో గౌరవం ఉంది. తన కుటుంబానికి, ఇంటి పెద్దలకు గౌరవం ఇస్తాడు. త్వరలోనే ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. అతను ప్రేమ వివాహం చేసుకున్నా మా పూర్తి మద్దతు ఉంటుంది. అతను ప్రస్తుతం వరుస సినిమాలు, ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్‌తో ఏడడుగులు నడిచే అమ్మాయి ఎవరనేది ఇప్పుడే చెప్పలేను. ఇండస్ట్రీకి సంబంధించిన వారా? బయటివారా? అన్నది త్వరలోనే మీకు తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయ్యాల్సిందే. ఇక చాలామంది అనుకుంటున్నట్లు ప్రభాస్, అనుష్కల పెళ్లి జరగదు. ఎందుకంటే వాళ్లు మంచి స్నేహితులు. అసలు వాళ్ల మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవు’ అని స్పష్టత నిచ్చారు శ్యామలా దేవి. ఇక ప్రభాస్‌ నటిస్తోన్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌ ఎల్లుండి(మార్చి11) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పూజాహెగ్డే హీరోయిన్‌ గా నటిస్తోన్న ఈ సినిమాలో అలనాటి అందాల తార భాగ్యశ్రీ, కృష్ణంరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read:TRS Dissent: గులాబీ తోటలో అసంతృప్తి సెగలు.. పాలమూరు లో కేసీఆర్.. ఖమ్మం గుమ్మంలో జూపల్లి..!

Multibagger Penny Stocks: ఒక్క నెలలోనే అన్ని లాభాలా.. ఆ 3 కంపెనీలు సూపర్..

Jai Bhim controversy: కొనసాగుతున్న జై భీమ్ వివాదం..చిక్కుల్లో హీరో సూర్య.. ఈటీ రిలీజ్‌ని అడ్డుకుంటామంటున్న పీఎంకే నేతలు