AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Penny Stocks: ఒక్క నెలలోనే అన్ని లాభాలా.. ఆ 3 కంపెనీలు సూపర్..

Multibagger Penny Stocks: తక్కువ కాలంలో మంచి ఆధాయం పొందాలనుకునే వారికి పెన్నీ స్టాక్స్ ఉత్తమమైన పెట్టుబడి ఎంపిక. మంచి ఫండమెంటల్స్ కలిగిన కొన్ని షేర్లను గమనించి వాటిలో పెట్టుబడి..

Multibagger Penny Stocks: ఒక్క నెలలోనే అన్ని లాభాలా.. ఆ 3 కంపెనీలు సూపర్..
stock Market
Ayyappa Mamidi
|

Updated on: Mar 09, 2022 | 8:27 AM

Share

Multibagger Penny Stocks: తక్కువ కాలంలో మంచి ఆధాయం పొందాలనుకునే వారికి పెన్నీ స్టాక్స్ ఉత్తమమైన పెట్టుబడి ఎంపిక. మంచి ఫండమెంటల్స్ కలిగిన కొన్ని షేర్లను గమనించి వాటిలో పెట్టుబడి పెట్టటం వల్ల మార్కెట్లలో అవి మంచి ఎదుగుదలను నమోదు చేసినపుడు ఆధాయాన్ని ఆర్జించవచ్చు. ఇటువంటి నిర్ణయం తీసుకునే ముందు కంపెనీ వ్యాపారం, మేనేజ్ మెంట్, కంపెనీ వ్యాపార వ్యూహంతో పాటు కంపెనీ వ్యాల్యుయేషన్ ను ఇన్వెస్టర్లు కచ్చితంగా గమనించాలి. ఆ కోవకు చెందినవే ఈ మూడు పెన్నీ షేర్లు. ఇవి గడిచిన నెల రోజుల వ్యవధిలో పెట్టుబడి దారులకు 150 శాతం మేర లాభాలను అందించాయి.

1. Tine Agro

టెక్స్ టైల్ రంగానికి చెందినది టైన్ ఆగ్రో కంపెనీ. మార్కెట్లు ఇంత ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ షేరు 147 శాతం పెరుగుదలను నమోదు చేసింది. డిసెంబర్ 31, 2022న రూ. 6.8 గా ఉన్న ఒక్కో షేర్ విలువ ఇప్పటికి 724 శాతం ఆదాయాన్ని అందించింది. ఈ షేరు గత కొంత కాలం నుంచి వరుసగా అప్పర్ సర్కూట్ లను తాకుతోంది. గతంలో ఈ కంపెనీ పేరు కన్సాల్ ఫైబర్స్ గా ఉండేది. కానీ కంపెనీ స్పిన్నింగ్, వీవింగ్, కోంబింగ్, అన్నిరకాల ఫైబర్ల తయారీలోకి వచ్చిన తరువాత తన పేరును మార్చుకుంది.

2. Kaiser Corporation

ప్యాకింగ్ వ్యాపారం చేస్తున్న కైజర్ కార్పొరేషన్ సైతం మదుపరులకు మంది లాభాలను అందిస్తోంది. ఈ కంపెనీ లేబుళ్లు , స్టేషనరీ ఆర్టికల్స్, కార్టూన్లు మ్యాగజైన్ల ప్రింటింగ్ వ్యాపారంలో రాణిస్తోంది. కానీ వీటికి తోడు సంస్థ సబ్సిడరీ కంపెనీల ద్వారా ఇతర వ్యాపారాలలోకి కొత్తగా ప్రవేశించింది. కంపెనీలో ప్రమోటర్ల వాటా 59 శాతంగా ఉంది. కంపెనీ ఒక నెల కాలంలో 150 శాతం రిటర్న్ ఇచ్చింది.

3. IEL

వంటనూనెల తయారీ రంగంలో ఈ ఐఈఎల్ కంపెనీ వ్యాపారాలు చేస్తోంది. గత నెల 7న దీని షేరు ధర రూ. 46.85గా ఉంది. కంపెనీ గడచిన నెల కాలంలో 122 శాతం వద్ధిని నమోదు చేసింది. తక్కువ లిక్విడిటీ కలిగిన ఈ సంస్థ మిడ్ క్యాప్ కంపెనీగా ఉంది. గుజరాత్ కు చెందిన ఈ సంస్థ వెజిటెబుల్ ఆయిల్స్ కు సంబంధించిన ఎగుమతుల వ్యాపారాలు నిర్వహిస్తోంది.

గమనిక: మల్టీ బ్యాగర్ పెన్నీ షేర్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. ఈ సమాచారం ఆధారంగా ట్రేడింగ్ చేయకండి. మీ సొంత నిర్ణయాలపై పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.

ఇవీ చదవండి..

Home Loan: హోమ్ లోన్ తీసుకునే వారికి షాక్.. ఇకపై ఆ రూ. 1.5 లక్షలు మినహాయింపు ఉండదా..!

Kim Jong-un: దూకుడు పెంచిన కిమ్ మామ.. అక్కడ అణు పరీక్షలకు ఏర్పాట్లు..