Akash Puri : ఆకాష్ పూరి కోసం ఈసారి రంగంలోకి రౌడీ హీరో విజయ్ దేవర కొండ
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బాల నటుడిగా చేసిన ఆకాష్ ప్రస్తుతం హీరోగా దూసుకుపోతున్నాడు.

Akash Puri : డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బాల నటుడిగా చేసిన ఆకాష్ ప్రస్తుతం హీరోగా దూసుకుపోతున్నాడు.మెహబూబా వంటి సినిమాతో ఆకట్టుకున్న ఆకాష్.. రీసెంట్ గా రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకాష్ ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అయ్యాడు ఈ కుర్రహీరో. రొమాంటిక్ సినిమాలో మాస్ యాక్షన్ తో అదరగొట్టిన ఆకాష్ ఇప్పుడు మరోసారి అలాంటి కంటెంట్ తోనే రాబోతున్నాడు. ‘చోర్ బజార్’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘జార్జ్ రెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆకాశ్ పూరి సరసన గెహ్నా సిప్పీ నటిస్తోంది.
ఇటీవలే ఈ సినిమా టైటిల్ సాంగ్ ను ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విడుదల చేశాడు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ సినిమాలో ఆకాష్ పూరి దొంగగా కనిపించనున్నాడు. కార్ల టైర్ల నుంచి బైక్ పార్టుల వరకు ప్రతిదీ ఎత్తేస్తూ చోర్ బజార్‌లో అమ్మేయడం ఈ గ్యాంగ్ పని. పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో ఆకాష్ పూరి మరో విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :