Puneeth Rajkumar: అప్పు ఆఖరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల కాబోతుంది ఈ సినిమా.

Puneeth Rajkumar: కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల కాబోతుంది ఈ సినిమా. ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) అకాల మరణం యావత్ సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసింది. గుండెపోటుతో పునీత్ గతేడాది అక్టోబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండే పునీత్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో అభిమానులు… సినీ ప్రముఖులు షాకయ్యారు. ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇక పునీత్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లుగా హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విడుదల చేస్తున్న విజయ్. ఎమ్ తెలిపారు. ఈ సినిమాలో పునీత్ రాజ్‌కుమార్ తో పాటుగా డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించారు. ఈ సినిమా కోసం పునీత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పునీత్ చిత్రానికి ఎలాగైనా భారీ విజయాన్ని అందించి ఆయనకు ఘననివాళి అర్పించాలని అప్పు అభిమానులు భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :




