Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సరసన ఆ ముద్దుగుమ్మ.. బాబీ.. చిరు సినిమాలో హీరోయిన్ ఎవరంటే..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సరసన ఆ ముద్దుగుమ్మ.. బాబీ.. చిరు సినిమాలో హీరోయిన్ ఎవరంటే..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 08, 2022 | 9:32 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య (Acharya) సినిమా పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మాత్రమే కాకుండా.. ప్రస్తుతం చిరు.. గాడ్ ఫాదర్.. భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలను షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ మూవీస్‏తోపాటు.. చిరు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ బ్యానర్ పై నిర్మించనుండగా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఉమెన్స్ డే సందర్భంగా… ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ శ్రుతి హాసన్ నటించనుంది. మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మహిళా దినోత్సవం రోజున ఇంతకంటే మంచి వార్త ఏం ఉంటుంది. వెల్ కమ్ శ్రుతి హాసన్ అంటూ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్రుతిహాసన్ వరుస చిత్రాలతో బిజీగా ఉంటుంది. క్రాక్ సూపర్ హిట్ తర్వాత శ్రుతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తిరిగి తెలుగు చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్‏లో దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో నటిస్తుంది. అలాగే.. గోపిచంద్ మలినేని.. నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Bala: విడాకులు తీసుకున్న మరో స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు.. షాక్‏లో అభిమానులు..

Anasuya Bharadwaj: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనసూయ తాజా ట్వీట్.. ఓ రేంజ్‌లో ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..

Priyanka Arul Mohan: ప్ర‌తి మ‌హిళా గ‌ర్వ‌ప‌డే సినిమా ఇ.టి.. ప్రియాంక అరుళ్ మోహన్ కామెంట్స్ వైరల్.

Alia Bhatt: హాలీవుడ్‌లో అడుగుపెట్టిన అలియా.. ఏకంగా ఆమెతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్న సీత..