Bala: విడాకులు తీసుకున్న మరో స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు.. షాక్లో అభిమానులు..
గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగానే ఉంటున్నాయి. చిన్న కారణాలు.. మనస్పర్థలతో వైవాహిక
గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగానే ఉంటున్నాయి. చిన్న కారణాలు.. మనస్పర్థలతో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. ఇప్పటికే సమంత.. నాగ చైతన్య, ధనుష్..ఐశ్వర్య రజినీకాంత్, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ సెలబ్రెటీ కపుల్స్ ఆకస్మాత్తుగా విడాకులు ప్రకటించడంతో అభిమానులు షాకయ్యారు. ఇప్పటికీ వీరంతా ఎందుకు విడిపోయారంటూ కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే.. తమ అభిమాన స్టార్ కపుల్స్ కలిస్తే మళ్లీ చూడాలని ఉందంటూ సోషల్ మీడియాలో వారి జ్ఞాపకాలను షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ తన భార్యతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలా తన భార్య మధుమలార్తో విడాకులు తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీరిద్దరు ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా బాల.. మధుమలార్ విడి విడిగా ఉంటున్నారు. విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజాగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరికి ఒక కూతురు ఉంది. బాలా తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ ఫేమస్. ఈయన దర్శకత్వంలో తమిళ్ స్టార్ విక్రమ్ నటించిన సేతు సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో శివపుత్రుడు పేరుతో డబ్ అయిన ఈ మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఆర్య సినిమా నేనే దేవుణ్ణి, వాడు..వీడు.. చిత్రాలు తెలుగులో మంచి ఆదరణను దక్కించుకున్నాయి.
Also Read: Chiranjeevi: నేను హీరోగా నిలదొక్కుకున్నానంటే ఆమే కారణం.. మహిళా దినోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి.
Trivikram Srinivas: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గురూజీ.. ఎన్ని సినిమాలు లైనప్ చేశారో తెలుసా..