Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Bhim controversy: కొనసాగుతున్న జై భీమ్ వివాదం..చిక్కుల్లో హీరో సూర్య.. ఈటీ రిలీజ్‌ని అడ్డుకుంటామంటున్న పీఎంకే నేతలు

Jai Bhim controversy: కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో సూర్య(Suriya) మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నాడు. సూర్య కొత్త సినిమా "ఈటీ " ని పీఎంకే పార్టీ నేతలు( PMKLeaders) టార్గెట్ చేశారు. రేపు రిలీజ్ కానున్న ఈటీ

Jai Bhim controversy: కొనసాగుతున్న జై భీమ్ వివాదం..చిక్కుల్లో హీరో సూర్య.. ఈటీ రిలీజ్‌ని అడ్డుకుంటామంటున్న పీఎంకే నేతలు
Pmk Man Seeks Apology From
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2022 | 8:23 AM

Jai Bhim controversy: కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో సూర్య(Suriya) మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నాడు. సూర్య కొత్త సినిమా “ఈటీ ” ని  పీఎంకే పార్టీ నేతలు( PMKLeaders) టార్గెట్ చేశారు. రేపు రిలీజ్ కానున్న ఈటీ మూవీ విడుదలని అడ్డుకుంటామని చెప్పారు. అంతేకాదు ఈటీ సినిమాను ఏ సినీ థియేటర్ లోనూ ప్రదర్శించకూడదని అల్టిమేటం జారీ చేశారు. తమను సూర్య  నటించిన జై భీం సినిమలో తమ కులాన్ని కావాలనే కించపరిచారని పీఎంకే పార్టీ ఆరోపిస్తున్నారు. కనుక జై భీం సినిమా నిర్మాత , నటుడు సూర్య భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పీఎంకే డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పకుంటే రేపు విడుదల కానున్న సూర్య ఈటీ సినిమా ను విడుదలను అడ్డకుంటామని హెచ్చరించారు.

ఇదే విషయంపై సూర్య అభిమానులు స్పందిస్తూ.. ఈటీ మూవీ విడుదలను అడ్డకుంటే తాము చూస్తూ ఊరుకోమని సూర్య అభిమానులు హెచ్చరించారు. మరోవైపు కోలీవుడ్ సినీ రైటర్స్ అసోసియేషన్ స్పందిస్తూ.. పీఎంకే పార్టీ వైఖరిని ఖండించారు. సామజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కోసం తీసే సినిమాలకు కులం రంగు పూయొద్దని విజ్ఞప్తి చేశారు.

Whatsapp Image 2022 03 09 At 7.47.10 Am

Whatsapp Image 2022 03 09 At 7.47.10 Am (1)

కుర్రాళ్లను ఫిదా చేస్తున్న ముద్దుగుమ్మ.. ప్రియాంక కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. (ఫొటోస్)