AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vrinda Vihari: అంటే సుందరానికి గుర్తు చేసే ‘కృష్ణ వ్రింద విహారి’

Krishna Vrinda Vihari Movie Review: చాన్నాళ్లుగా పర్ఫెక్ట్ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు నాగశౌర్య. ఆయన గత చిత్రాలు లక్ష్య, వరుడు కావలెను, అశ్వత్థామ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అందుకే ఇప్పుడు కృష్ణా వృందా విహారి మీద గంపెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

Krishna Vrinda Vihari: అంటే సుందరానికి గుర్తు చేసే 'కృష్ణ వ్రింద విహారి'
Kvv
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Rajeev Rayala|

Updated on: Sep 23, 2022 | 1:11 PM

Share

చాన్నాళ్లుగా పర్ఫెక్ట్ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు నాగశౌర్య. ఆయన గత చిత్రాలు లక్ష్య, వరుడు కావలెను, అశ్వత్థామ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అందుకే ఇప్పుడు కృష్ణా వృందా విహారి మీద గంపెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను జనాలకు రీచ్‌ చేయించాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర కూడా చేశారు నాగశౌర్య. మరి శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా జనాలకు చేరువైందా? చదివేయండి.

సినిమా: కృష్ణ వ్రింద విహారి

నిర్మాణ సంస్థ: ఐరా క్రియేషన్స్

ఇవి కూడా చదవండి

నటీనటులు: నాగశౌర్య, షెర్లి సెటియా, రాధిక శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ తదితరులు

రచన – దర్శకత్వం అనీష్ ఆర్‌.కృష్ణ

కెమెరా: సాయి శ్రీరామ్‌

ఎడిటింగ్‌: తమ్మిరాజు

సంగీతం: మహతి స్వరసాగర్‌

విడుదల: సెప్టెంబర్‌ 23, 2022

కృష్ణ (నాగశౌర్య) సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి. పద్ధతి గల కుటుంబంలో పెరిగిన వ్యక్తి. ఆచారాలకు ప్రాణం ఇచ్చే నానమ్మ , తల్లి, అక్క మధ్య అపురూపంగా పెరిగిన అబ్బాయి. ఉద్యోగం కోసం సిటీలో అడుగుపెడతాడు. అక్కడ వృంద (షెర్లి)ని చూసి ఇష్టపడతాడు. ఆమె, అతనికి ఆఫీస్‌లో టీమ్‌ లీడర్‌. వారు పనిచేసే ప్రాజెక్ట్ మేనేజర్‌ నందన్‌ కి వృంద అంటే చాలా ఇష్టం. ఆమెను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమెకున్న ఓ సమస్యతో అతని తల్లి వారి పెళ్లికి ఒప్పుకోదు. అయితే వృందను జీవిత భాగస్వామిగా ఊహించుకున్న కృష్ణకు మాత్రం ఆ లోపం పెద్దదిగా అనిపించదు. వృందకున్న లోపాన్ని తనకున్నట్టుగా ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు. వెయ్యి అబద్ధాలు చెప్పి చేసుకున్న పెళ్లిళ్లు కూడా ఆగుతున్న సొసైటీలో, కృష్ణ చెప్పిన ఒక్కగానొక్క అబద్ధం పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. దాన్నుంచి అతను ఎలా బయటపడ్డాడు? తన తల్లికీ, వృందకూ ఎలా సర్దిచెప్పుకున్నాడు? కాపురాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు అనేది కథ.

నుదుటి మీద నామంతో, సిక్స్ ప్యాక్‌ బాడీతో చూడ్డానికి స్క్రీన్‌ మీద కృష్ణ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు నాగశౌర్య. టీమ్‌ లీడర్‌గా, నార్త్ ఇండియన్‌ గర్ల్ గా, మోడ్రన్‌ ఇల్లాలిగా వృంద పాత్రకు షెర్లి సూట్‌ అయ్యారు. ఆఫీస్‌లో కొలీగ్స్ గా సత్య, రాహుల్‌ రామకృష్ణ కేరక్టర్లు నవ్వు తెప్పిస్తాయి. వెన్నెల కిశోర్‌ కనిపించనంత సేపు నవ్విస్తారు. కెమెరా పనితనం, లొకేషన్లు కూడా బావున్నాయి. పాటలు మళ్లీ మళ్లీ పాడుకునేలా లేవు కానీ, కథతో సాగిపోతాయి. మిగిలిన అన్ని విషయాలూ ఫర్వాలేదనిపించినా, కథ మాత్రం మొదట్లోనే రివీల్‌ అయిపోతుంది. ఫస్టాఫ్‌ ఇంటర్వెల్‌ వచ్చే వరకు కూడా ఎక్కడా ఎగ్జయిటింగ్‌గా అనిపించదు. చూసిన సన్నివేశాలనే చూస్తున్నట్టు బోర్‌ కలుగుతుంది. పైగా ఇటీవలే విడుదలైన అంటే సుందరానికి సినిమాను అడుగడుగునా గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయికి సమస్య ఉన్న విషయం కొత్తదే అయినా, ఆ విషయాన్ని స్క్రీన్‌ మీద చెప్పడం, భార్యాభర్తల ఎడబాటు, దానికి వాళ్లు బాధపడుతున్న తీరును చూపించడంలో ఎక్కడో గాఢత మిస్‌ అయినట్టు అనిపిస్తుంది. ఇంకాస్త స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తపడి, కొత్త సన్నివేశాలను రాసుకుని ఉంటే సినిమా మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది. కొడుక్కి లోపం ఉన్నప్పుడు బయటపడని అహం, కోడలి విషయంలో ఎందుకు పడుతుంది? పెళ్లైన అబ్బాయి అంటే అతను మాత్రమే కాదు… అతని తల్లి, భార్య కూడా అని చెప్పే డైలాగులు అర్థవంతంగా ఉన్నాయి. బ్రహ్మాజీ కేరక్టర్‌ని స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిందే.

సరదాగా చూడాలనుకునేవారికి నచ్చతుంది కృష్ణావృందా విహారి.   – డా. చల్లా భాగ్యలక్ష్మి