Actor Robo Shankar : ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో నటుడు రోబో శంకర్ మృతి..
సినీరంగంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ అనారోగ్య కారణాల వల్ల మరణించారు. చెన్నైలో షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. వెంటనే చిత్రయూనిట్ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న రోబో శంకర్ తుదిశ్వాస విడిచారు.

తమిళ సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన కాసేపటి క్రితం మరణించారు. ధనుష్ నటించిన మారి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అజిత్ నటించిన విశ్వాసం, శివకార్తికేయన్ తో వేలైక్కారన్ వంటి చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించారు. గత కొన్ని నెలలుగా ఆయన కామెర్లుతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్పించగా, చికిత్స తీసుకుంటూనే సెప్టెంబర్ 18న మరణించారు. ఆయనకు 46 ఏళ్లు. గతంలో ఆయన కామెర్లుతో బాధపడుతూ, దాని నుంచి కోలుకుని మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. రోబో శంకర్ హే, దీపావళి వంటి చిత్రాలతో సినీప్రయాణం స్టార్ట్ చేశాడు. తన కామెడీ టైమింగ్ తో అలరించారు.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
కమల్ హాసన్ తమిళంలో రోబో శంకర్ కు నివాళి అర్పించారు. “రోబో శంకర్. రోబో అనేది ఒక మారుపేరు. నా నిఘంటువులో నువ్వు నా తమ్ముడివి. నన్ను వదిలి వెళ్ళిపోతావా? నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు. నా పని అసంపూర్ణంగానే ఉంది. రేపు నువ్వు మనకోసం వెళ్ళిపోయావు. కాబట్టి, రేపు మనది.’ అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. రోబో శంకర్ మృతదేహాన్ని ఈ రాత్రి చెన్నైలోని వలసరవక్కంలోని ఆయన ఇంటికి తరలిస్తారు. శుక్రవారం నగరంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..




