Little Hearts: ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ ఫేమస్ హీరో ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో..
లిటిల్ హార్ట్స్.. ప్రస్తుతం తెలుగు నాట బాగా వినిపిస్తోన్న సినిమా పేరు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ యూట్యూబర్ మౌళి తనూజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో శివానీ నాగారం హీరోయిన్ గా నటించింది. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హసన్ నిర్మాతగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించాడు. టీచర్స్ డే కానుకగా సెప్టెంబర్ 05న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ తెగ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పటివరకు సుమారు రూ. 40 కోట్ల దాకా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్ తదితర స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోన్న ఈ లిటిల్ హార్ట్స్ మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
లిటిల్ హార్ట్స్ సినిమాలో మౌళి తండ్రిగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల నటించారు. అయితే మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు సాయి మార్తాండ్ వేరొకరిని అనుకున్నారట. మౌళి తండ్రి రోల్ కోసం జగపతిబాబును తీసుకోవాలనుకున్నాడట. ఆయనకు స్క్రిప్ట్ కూడ వినిపించారట. జగ్గూభాయ్ కు కూడా సినిమా కథ పిచ్చిపిచ్చిగా నచ్చేసిందట. అయితే అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ తో లిటిల్ హార్ట్స్ సినిమాలో జగపతి బాబు నటించలేకపోయారట. ఈ విషయాన్ని దర్శకుడు సాయి మార్తాండ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కేఎల్ యూనివర్సిటీలో లిటిల్ హార్ట్స్ టీమ్..
KL University Mass & Josh 🔥🔥
Massive Love Showered on Team #LittleHearts college visit 🤩
The Biggest Laughbuster in Cinemas Now 🎟 https://t.co/UJEbZ7EBvE pic.twitter.com/VfnyBt5MYv
— Vamsi Nandipati Entertainments (@VNE_Offl) September 17, 2025
‘జగపతి బాబు గారు సినిమా చేయలేకపోయినా, ఆయన ఇచ్చిన సూచన వల్లే స్క్రిప్ట్ బాగా వచ్చింది. కథలో ఉన్న చిన్న లోపాన్ని చూపించి, మాకు గొప్ప మార్గనిర్దేశం చేశారాయన. అందుకు నేను ఆయనకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను’ అన్నారు లిటిల్ హార్ట్స్ డైరెక్టర్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








