Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎక్కడ .? ఇప్పుడు ఏం చేస్తున్నాడు.?
హృదయకాలేయం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంపూర్ణేష్. అతని అసలు పేరు అసలు పేరు నరసింహాచారి. సోషల్ మీడియా ద్వారా సంపూర్ణేష్ బాబు మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక హృదయకాలేయం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సెటైరికల్ మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
టాలీవుడ్‌లో సంపూర్ణేష్ బాబు ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. హీరో అంటే హ్యాండ్సమ్‌గా ఉండాలి, మంచి బాడీ ఉండాలి, డాన్స్ స్కిల్స్ ఉండాలి అని అనుకుంటారు. కానీ అలాంటివి ఏమీ లేకుండా హిట్స్ అందుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సంపూర్ణేష్. అతని అసలు పేరు అసలు పేరు నరసింహాచారి. సోషల్ మీడియా ద్వారా సంపూర్ణేష్ బాబు మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక హృదయకాలేయం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సెటైరికల్ మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట ప్రారంభమైనది. అలాగే కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ లోనూ నటించి మెప్పించాడు సంపూర్ణేష్.
ఇది కూడా చదవండి : Prabhas : 25 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ప్రభాస్ కోసం తెలుగులోకి.. ఆమె ఎవరు.? ఏ సినిమా కోసం అంటే
తన నటనతో పాటు కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. సంపూ.. చాలా పేద కుటంబం నుంచి వచ్చాడు. సంపూ ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. వీరిది పేద విశ్వకర్మ కుటుంబం. అదే ఊర్లో వెండి బంగారు పని చేస్తుండేవాడు. సంపూర్ణేష్ బాబుకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. ఊర్లో ఉండే మరో నటుడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు సంపూ. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మహాత్మ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు సంపూర్ణేష్.
ఇది కూడా చదవండి :డీ గ్లామర్ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె..
ఆ తర్వాత హీరోగా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే సంపూ ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. చివరిగా సంపూ.. మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమా చేశాడు. అయితే ఆయన ఖాళీగా లేరు. సంపూ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఆయన ఇండస్ట్రీని వదిలిపెట్టారు అని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ ఎక్కడ కనిపించడం లేదు సంపూ.. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉండటం ఇష్టం లేకపోవడంతో సంపూ.. ఊరికి తిరిగి వెళ్లిపోయాడని తెలుస్తోంది. సొంత ఊరిలో తన వృత్తిని చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఊర్లో చాలా సాదా సీదా జీవితం గడుపుతుంటాడు సంపూ.. అందరితో కలిసిమెలిసి జీవిస్తున్నాడు సంపూ.
ఇది కూడా చదవండి : Tollywood : రోడ్డు పై డాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శబాష్ అనాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.