Tollywood : అందంలో అదరహో.. గ్లామర్ ఫోజులతో అరాచకం.. 19 ఏళ్లుగా హిట్టు కోసం వెయిట్ చేస్తోన్న హీరోయిన్..
సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సాధారణ విషయం కాదు. ముఖ్యంగా హీరోయిన్లుగా స్టార్ డమ్ సంపాదించుకోవాలంటే అందం, ప్రతిభతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాల్సిందే. చాలా మంది హీరోయిన్స్ బ్యాక్ టూ బ్యా్క్ ఆఫర్స్ అందుకున్నప్పటికీ సరైన్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నవారు ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. దాదాపు 19 సంవత్సరాలుగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 19 సంవత్సరాలుగా హిట్టు కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్ ఒకరు ఉన్నారు. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్న ఈ హీరోయిన్.. కొన్నాళ్లపాటు సినిమాల్లో సైలెంట్ అయ్యింది. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. గ్లామర్ షోతో మెంటలెక్కిస్తుంది. నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది ఈ వయ్యారి. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. కానీ ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దీంతో ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో క్రేజ్ మాత్రం రాలేదు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. వేదిక. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వరుస సినిమాలతో చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంది ఈ ముద్దుగుమ్మ.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
వేదిక.. 2006లో మదరాసి సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదే ఏడాది ముని సినిమాతో హిట్టు కొట్టింది. అలాగే కళ్యాణ్ రామ్ సరసన విజయదశమి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ మూవీ హిట్ కాలేదు. తెలుగులో వరుసగా బాణం, దూరంగా దగ్గరగా, రూలర్, రజాకార్, ఫియర్ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు సరైన హిట్టు మాత్రం అందుకోలేదు. తెలుగులో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ రావాల్సినంత బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండిపోయింది వేదిక. ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన వేదిక.. గ్లామర్ రోల్స్ తో అదరగొట్టేస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
కెరీర్ తొలినాళ్లల్లో సంప్రదాయ పాత్రలతో ఆకట్టుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు మాత్రం గ్లామర్ క్వీన్ గా రాణిస్తుంది. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన 3 హిట్ కావడంతో మళ్లీ ఫాంలోకి వచ్చింది. ఇటీవలే యక్షిణి అనే వెబ్ సిరీస్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో వేదిక రెచ్చిపోయి నటించింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో అందాల బీభత్సం సృష్టిస్తుంది. గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తుంది ఈ వ్యయారి.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?




