AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ క్రికెటర్ కావాలనుకున్నాడు.. మైదానంలో బొటనవేలికి గాయం.. కట్ చేస్తే.. 9 జాతీయ అవార్డ్స్.. ఎవరంటే..

సాధారణంగా చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ అనుహ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నవారి గురించి తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక వ్యక్తి టాప్ క్రికెటర్ కావాలనుకున్నాడు. కానీ అతడిని విధి సినిమాల్లోకి వచ్చేలా చేసింది.

టాప్ క్రికెటర్ కావాలనుకున్నాడు.. మైదానంలో బొటనవేలికి గాయం.. కట్ చేస్తే.. 9 జాతీయ అవార్డ్స్.. ఎవరంటే..
Vishal Bharadwaj
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2025 | 4:30 PM

Share

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. క్రికెట్ మైదానంలో ఫోర్లు, సిక్సర్లు కొట్టాలని.. టీమిండియాలో టాప్ క్రికెటర్ కావాలనుకున్నాడు. కానీ అతడి జీవితాన్ని విధి మలుపు తిప్పింది. టాప్ క్రికెటర్ కావాల్సిన వ్యక్తి.. అనుహ్యంగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కట్ చేస్తే.. 9 జాతీయ అవార్డులు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్, రచయిత కమ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆగస్టు 4, 1965న ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జన్మించి విశాల్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం.

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

అతడు ఉత్తర ప్రదేశ్ అండర్-19 జట్టు తరపున ఆడాడు. కానీ ప్రాక్టీస్ సెషన్‌లో అతడి బొటనవేలికి తీవ్రమైన గాయం కావడంతో క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో స్వయంగా ఓ పాటను స్వరపరిచాడు. ఆ పాటను అప్పుడే సంగీత స్వరకర్త ఉషా ఖన్నాకు వినిపించాడు. ఈ పాటను 1985 చిత్రం ‘యార్ కసమ్’లో ఉపయోగించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా సినీరంగంలోకి అడుగుపెట్టి.. ‘అభయ్: ది ఫియర్‌లెస్’ చిత్రానికి సంగీతం అందించారు. మాచిస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సత్య, గాడ్ మదర్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించారు. గాడ్ మదర్ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డ్ గెలుచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా దర్శకుడిగానూ మారారు. ఆయన తెరకెక్కించిన హైదర్ సినిమాకు ఏకంగా 5 జాతీయ అవార్డ్స్ వచ్చాయి. ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు బాలీవుడ్ సినీ పరిశ్రమలో మొత్తం 9 జాతీయ అవార్డులు గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. అలాగే ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. విశాల్ సినిమా ప్రయాణంలో అనేక చిత్రాలు, ఎన్నో పాటలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

Vishal Bharadwaj News

Vishal Bharadwaj News

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..