- Telugu News Photo Gallery Cinema photos Do You Know These Are The Health and Fitness Secrets Of Akkineni Nagarjuna
Nagarjuna : 65 ఏళ్ల వయసులో నవ మన్మథుడిలా నాగ్.. ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. ఈ ఒక్క పనిచేస్తే చాలట..
అక్కినేని నాగార్జున.. దశాబ్దాలుగా తెలుగు ప్రపంచాన్ని ఏలేస్తున్న అగ్రహీరోలలో ఒకరు. నాగేశ్వరరావు నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. నిజానికి నాగార్జునకు అప్పటికీ.. ఇప్పటికీ అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. తాజాాగా నాగ్ ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్ చేశారు సూపర్ స్టార్ రజినీకాంత్.
Updated on: Aug 06, 2025 | 4:10 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ అగ్ర హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 65 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. అలాగే ఈ వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు.

అయితే నాగార్జున ఫిట్నెస్, లుక్ సీక్రెట్స్ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదోక న్యూస్ వైరలవుతూనే ఉంటుంది. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న నాగ్.. ఈ మూవీ ప్రమోషన్లలో రజినీ అడగ్గా తన ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్ చేశారట.

నాగార్జున అందానికి ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే అంటూ రజినీ అసలు విషయం చెప్పేశారు. రోజూ 45 నిమిషాల నుంచి గంట వరకు కచ్చితంగా వ్యాయామం ఉంటుందని.. రోజూ ఒకే టైపు వ్యాయమం కాకుండా బరువులు ఎత్తడం, థ్రెడ్ మిల్ పై పరిగెత్తడం, స్విమ్మింగ్, వాకింగ్ అన్ని రకాల వర్కవుట్స్ చేస్తుంటారట.

అలాగే ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేయడం. రోజులో 12 గంటలు తింటే.. మరో 12 గంటలు ఉపవాసం ఉంటారు. ఉదయం కిమ్చి, ఉడికించిన క్యాబేజీ, బ్రొకోలి, కూరగాయ ముక్కలు, గోరువెచ్చని నీళ్లు, కాఫీ మాత్రమే తీసుకుంటారు. ఇక మధ్యాహ్నం పప్పు కూర, పచ్చడి, భోజనం చేస్తారు.

రాత్రి 7 నుంచి 7.30 గంటల మధ్యలోనే డిన్నర్ చేయడం.. అందులో సలాడ్స్, చికెన్ లేదా ఫిష్ ఉండేలా చూసుకుంటారు. రాత్రి భోజనం తర్వాత ఏదైన ఒక స్వీట్, డిజర్డ్ తిని.. ఉదయం అది కరిగేంతలా వర్కౌట్స్ చేస్తారట. ఎప్పుడూ ఒత్తిడి లేకుండా ఉండడం.. ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకుంటారట.




