Tollywood: సినిమాల్లో పద్దతిగా.. నెట్టింట గ్లామర్ అరాచకం.. బీర్ తాగుతూ చిల్ అవుతున్న ఈ హీరోయిన్ ఎవరంటే..
విభిన్నమైన చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలతో సినీరంగంలోకి తనదైన ముద్ర వేసింది ఈ హీరోయిన్. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిగా కనిపిస్తూ అద్భుతమైన నటనతో మెప్పించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమెకు అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు. తాజాగా స్నేహితులతో కలిసి బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆమె ఎవరంటే..

సినీరంగంలో వైవిధ్యమైన పాత్రలతో తనదైన ముద్ర వేసిన హీరోయిన్ ఆమె. తక్కువ సమయంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. చూడచక్కని అందం.. ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి జనాలకు దగ్గరయ్యింది. అయితే సినిమాల్లో పద్దతిగా కనిపిస్తూ అద్భుతమైన నటనతో జనాల హృదయాలను గెలుచుకుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అరాచకం సృష్టిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా గ్లామర్ లుక్స్ లో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?
ఇటీవలే కలియుగం 2064 అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతకు ముందు 2015లో మలయాళంలో వచ్చిన కోహినూర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ముంగారు మేల్ 2, ఉర్వి, కాట్రు వెళియదై, ఇవన్ తంతిరాన్, విక్రమ్ వేద, రిచి, కృష్ణ అండ్ హిజ్ లీలా, డాకు మహారాజ్ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది.
అయితే ఇన్నాళ్లు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఖాతాలో వరుసగా గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు షాకిస్తుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మనసులు కొల్లగొట్టేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇండస్ట్రీలో సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..








