AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రభాస్‏తో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలోనే సెన్సేషన్.. కట్ చేస్తే.. రాజకీయాల్లో ఈ హీరోయిన్ ఫైర్ బ్రాండ్..

సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటిగా ప్రశంసలు అందుకుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అద్భుతమైన నటనతో మెప్పించింది. ముఖ్యంగా విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం రాజకీయాల్లో దూసుకుపోతుంది.

Tollywood: ప్రభాస్‏తో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలోనే సెన్సేషన్.. కట్ చేస్తే.. రాజకీయాల్లో ఈ హీరోయిన్ ఫైర్ బ్రాండ్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2025 | 7:21 AM

Share

సినీరంగంలో ఆమె ఫైర్ బ్రాండ్. 15 ఏళ్ల వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయి సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా సినిమా పరిశ్రమను శాసించింది. అంతేకాదు.. అద్భుతమైన నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. గ్లామర్ రోల్స్.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక ఇండస్ట్రీలోని నెపోటిజంపై ముక్కుసూటిగా మాట్లాడి నిర్మాతలకు, స్టార్ హీరోలకే వణుకు పుట్టించింది. కానీ ఆ తర్వాతే ఆమె మాటలు తన కెరీర్ పైనే ప్రభావం చూపించాయి. నెమ్మదిగా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీగా గెలిచింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదండి.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ సరసన నటించిన ధూమ్ సినిమాలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే కెరీర్ తొలినాళ్లల్లో ఆమె నటించిన ఫ్యాషన్ సినిమాలో కంగనా రనౌత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోడిగా ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కంగనా చేసిన మొదటి సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.

అయితే కంగనా ఇండస్ట్రీలో నెపోటిజం పై కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెతో పనిచేసేందుకు దర్శకనిర్మాతలు అంతగా చూపించలేదు. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే అనవసర విషయాల్లో తలదూర్చి ఆరోపణలు చేసింది. ఇక కొన్ని నెలల క్రితం ఆమె నటించిన చంద్రముఖి 2 సినిమా సైతం అట్టర్ ప్లాప్ అయ్యంది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో అడుగుపెట్టింది. 2024 ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచింది. ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..