Actor : ఒకప్పుడు నిర్మాత డ్రైవర్.. ఆఫీస్ బాయ్.. కట్ చేస్తే.. ఒక్క సినిమాతో బాక్సాఫీస్ సెన్సేషన్..
ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరో. కానీ ఒకప్పుడు అతను డ్రైవర్. అతను ఆఫీస్ బాయ్‌గా కూడా పనిచేశాడు. కానీ అతను ఒక రోజు భారతీయ సినిమా స్టార్ అవుతాడని అతను ఎప్పుడూ ఊహించలేదు. 2022 బ్లాక్‌బస్టర్ అతన్ని రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చింది. అతను తన నటనకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న నటుడు ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం అతడు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్న హీరో. ఒక్క సినిమా అతడి కెరీర్ మార్చేసింది. ఒకప్పుడు డ్రైవర్… అలాగే ఆఫీస్ బాయ్‌గా, తరువాత నిర్మాత డ్రైవర్‌గా పనిచేశాడు. సినిమా పట్ల మక్కువ, బహుశా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కోరిక అతన్ని స్టార్‌గా మార్చాయి. 2022లో, అతను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిత్రాన్ని అందరి ముందుకు తీసుకువచ్చాడు. ఇప్పుడు, అతను ఒక బ్లాక్‌బస్టర్‌కి ప్రీక్వెల్‌తో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదు.. కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాంతార. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడు తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ అందుకుంటుంది. ఇటీవల ఈ మూవీ ఇంటర్వ్యూలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సినీరంగంలోకి రాకముందు తాను పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ముంబైతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. 2008లో తాను అంధేరి వెస్ట్ లోని ఒక ప్రొడక్షన్ హౌస్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేశానని అన్నారు. అలాగే నిర్మాతకు డ్రైవర్ గా ఉన్నానని .. ఒకే ఒక్క సినిమా తనకు గౌరవం, ప్రేమ, ఆశీర్వాదాలు అందిస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. సినిమా ప్రొడక్షన్ హౌస్ దగ్గర రోడ్డు మీద వడ పావ్ తింటున్నప్పుడు కూడా తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..




